Idli : మీరు ఇడ్లీ ప్రియులా? అయితే, మీకో షాకింగ్ న్యూస్!

ఇడ్లీ ప్రియులందరికీ ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది శాస్త్రవేత్తల బృందం. అది ఏంటి అంటే జీవ వైవిధ్యానికి అత్యంత హాని కలిగించే 25 వంటకాల్లో ఇడ్లీ, చనా మసాలా, రాజ్మా, చికెన్‌ వంటివి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

New Update
Idli : మీరు ఇడ్లీ ప్రియులా? అయితే, మీకో షాకింగ్ న్యూస్!

Idli Lovers : భారత్(India) లో ఏ రాష్ట్రానికి వెళ్లినా దొరికే తినుబండారంగా ఇడ్లీ(Idli) చెప్పుకోవచ్చు. ఇడ్లీ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని వైద్యులు, మన పెద్దవారు ఎప్పటి నుంచో చెబుతుంటారు. ఆవిరి మీద ఉడికించి తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు(Health Professionals) కూడా ఇడ్లీనే ఎక్కువ తినాలని సూచిస్తుంటారు.

కానీ ఇడ్లీ ప్రియులందరికీ ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది శాస్త్రవేత్తల బృందం. అది ఏంటి అంటే జీవ వైవిధ్యానికి అత్యంత హాని కలిగించే 25 వంటకాల్లో ఇడ్లీ, చనా మసాలా, రాజ్మా, చికెన్‌ వంటివి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 151 ప్రసిద్ద వంటకాలను జీవ వైవిధ్యం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని నిర్వహించినట్లు వివరించారు.

ఈ నివేదికలో అత్యధిక స్థాయిలో జీవ వైవిద్య ప్రభావం ఉన్న ఫుడ్‌ గా స్పానిష్‌ రోస్ట్‌ లాంబ్‌ డిష్‌ లెచాజో గా గుర్తించింది. ఆ తరువాత బ్రెజిల్‌(Brazil) నుంచి గొడ్డు మాంసం గా నిర్థారించింది. నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం..ఇడ్లీ ఆరో స్థానంలో ఉండగా రాజ్మా ఏడో స్థానంలో ఉంది.

పప్పుల వల్ల కూడా జీవ వైవిధ్యానికి నష్టం..

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, మాంసంతో కూడిన వంటకాల కంటే శాఖాహార వంటకాలు జీవవైవిధ్యానికి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తెలిసింది. కానీ బియ్యం, పప్పులు ప్రధాన పదార్ధంగా ఉండే వంటల్లో కూడా జీవవైవిధ్యం నష్టపోతున్నట్లు గుర్తించారు.
తృణధాన్యాలు, బియ్యంలో జీవవైవిధ్య నష్టం రేట్లు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, మరింత సమాచారం సేకరించినప్పుడు అటువంటి ప్రదర్శన అవకాశం ఉందని అధ్యయనానికి నాయకత్వం వహించిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌(National University Of Singapore) లోని బయోలాజికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో అన్నారు.

Also Read : విమానంలో ఏసీ ఆఫ్‌…సాంకేతిక లోపంతో 5 గంటల పాటు లోపలే ప్రయాణికులు.. పలువురికి తీవ్ర అస్వస్థత!

Advertisment
Advertisment
తాజా కథనాలు