Polling Officer : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) తొలి దశలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని 8 స్థానాలకు పోలింగ్ జరగ్గా, రాష్ట్రంలో 57.54 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికలకు ముందు పోలింగ్ అధికారి ఇషా అరోరా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అయ్యాయి. సహరాన్‌పూర్‌లోని బూత్‌లో పోలింగ్ అధికారి ఇషా అరోరా వెలుగులోకి వచ్చారు. తన గ్లామర్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూడటానికి పోలింగ్ అధికారిని వలే కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఫిదా చేసింది. ఇషా అరోరా గ్లామర్ చూసిన నెటిజన్లు సహరాన్ పూర్ లో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఇషా అరోరా ఎవరు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఉద్యోగి అయిన ఇషా అరోరా(Isha Arora) ప్రస్తుతం గంగోహ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మదారి గ్రామంలో సహరన్‌పూర్ లోక్‌సభ ఎన్నికల 2024 కోసం తన పోలింగ్ డ్యూటీ నిర్వహించారు. గర్హి గ్రామంలోని పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారిగా పనిచేస్తున్న ఇషా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గురించి ఇషా అరోరా స్పందించారు. తనకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించడం తన బాధ్యత అని..ఈ సమయంలో స్త్రీ, పురుషులందరూ సమయమనం పాటించాలన్నారు. లేదంటే ఇంత పెద్ద ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఇది ఎన్నికల సమయం, సమయానికి రావడం నా కర్తవ్యం కాబట్టి నేను బిజీగా ఉన్నాను.నేను నా డ్యూటీని సమయానికి నిర్వహించాను అని చెప్పుకొచ్చింది.
తన అందం గురించి:
ఇషా అరోరా మాట్లాడుతూ, 'సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు చూసుకునే సమయం లేదు. ఎన్నికల బిజీ ఉండటంతో మొబైల్ చూసుకునే సమయం కూడా దొరకలేదు. వైరల్ అవుతున్న ఫొటోలు ఇప్పుడు చూసాను. చాలా బాగున్నాయి. ఇందులో అందం గురించి ఏమీ లేదు. సమయపాలన గురించి. సమయానికి డ్యూటీకి చేరుకున్నాను. మీరు దీన్ని పని పట్ల నిబద్ధత గురించి మాత్రమే ఉంది. అంతే తప్పా మరొకటి లేదంటూ సింపుల్ గా చెప్పుకొచ్చారు.
బూత్‌కు EVMని తీసుకువెళుతున్న అధికారితో కలిసి వెళ్లిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన వెంటనే వైరల్ అయ్యాయి. ఇషా అరోర్ గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపించారు. ఆమె పోలింగ్ సామగ్రిని తీసుకుని వెళ్తున్న సమయంలో తోటి అధికారులు కూడా ఆమెతో ఫొటోలు దిగారు. ఇషా తన గ్లామరస్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది.ఇక ప్రజాస్వామ్యం గొప్ప పండుగలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఓటర్లందరికీ ఇషా విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!