Covishield Side Effects: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

కరోనా నివారణ కోసం ఉపయోగించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది అనే వార్తల నేపథ్యంలో మాజీ ICMR శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ దీనివలన పెద్దగా ప్రమాదం లేదని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Covishield Side Effects: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

Covishield Side Effects: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఇటీవల నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే.. 10 లక్షల మందిలో కేవలం ఏడెనిమిది మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను స్వీకరించి, థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అని పిలిచే అరుదైన దుష్ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని తాజాగా చెబుతున్నారు.  భారతదేశపు టాప్ ఎపిడెమియాలజిస్ట్, మాజీ ICMR శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్, ఈ వ్యాక్సిన్ పొందిన వారికి "అస్సలు ప్రమాదం లేదు" అని అన్నారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ రామన్.. కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్నపుడు ప్రమాదం(Covishield Side Effects) ఎక్కువ ఉంటుంది. అయితే, అది రెండవ డోస్ తో తగ్గుతుంది. మూడో డోస్ తీసుకున్నపుడు అది మరింత తగ్గిపోతుంది అని చెప్పారు. అలాగే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక అది వ్యాక్సిన్ తీసుకున్న ప్రారంభంలోనే అంటే తీసుకున్న రెండు మూడు నెలల్లోనే కనిపిస్తుంది అని ఆయన అంటున్నారు. 

ఇటీవల యూకే మీడియా కథనాల్లో కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం భారత్ కు చెందిన ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనికా సంస్థ తన కోవిడ్ వ్యాక్సిన్(Covishield Side Effects) అరుదుగా రక్తం గడ్డకట్టే దుష్ప్రభావానికి దారితీస్తుందని అంగీకరించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ AZ Vaxzevria సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి తయారైంది. మనదేశంలో కనీసం 90 శాతం మంది ఈ టీకా తీసుకున్నారు. 

అయితే, ఈ విషయంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) లో ముఖ్య సభ్యుడిగా ఉన్న డాక్టర్ రామన్ గంగాఖేద్కర్  “వ్యాక్సిన్‌ను ప్రారంభించిన ఆరు నెలల్లోనే, టిటిఎస్ అడెనోవైరస్ వెక్టర్ వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావం(Covishield Side Effects)గా గుర్తించడం జరిగింది. వ్యాక్సిన్‌ను అర్థం చేసుకోవడంలో కొత్త లేదా మార్పు ఏమీ లేదు.’’ అని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందిలో కేవలం 7 నుంచి 8 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. లక్షలాది మందిపై ఈ టీకా సానుకూల ప్రభావం కారణంగా, సంబంధిత ప్రమాదం చాలా తక్కువగా ఉందని గంగాఖేద్కర్ వెల్లడించారు.  

Also Read: వెండితెరపై హీరో కృష్ణ సాహస సంతకం అల్లూరి సీతారామరాజు 

ఆస్ట్రాజెనెకా, 51 మంది హక్కుదారులతో కూడిన సమూహ చర్య కోసం ఫిబ్రవరిలో లండన్‌లోని హైకోర్టుకు సమర్పించిన చట్టపరమైన పత్రంలో, కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో దాని వ్యాక్సిన్‌(Covishield Side Effects)ను అభివృద్ధి చేసినట్లు అంగీకరించింది. "చాలా అరుదైన సందర్భాలలో" థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌కు దారితీయవచ్చు. అని సంస్థ పేర్కొన్నట్టు బ్రిటీష్ వార్తా సంస్థ ది డైలీ టెలిగ్రాఫ్ నివేదించింది. 

రిస్క్ వర్సెస్ ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో టీకాలు లేదా మందులు ఎల్లప్పుడూ "రిస్క్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్" ఉపయోగించి ఆమోదిస్తారు.  "ఈ సందర్భంలో కూడా, ప్రయోజనం ఊహించిన ప్రమాదం కంటే చాలా పెద్దది," అని సంక్లిష్టమైన విషయాలను క్లియర్ చేయడంలో సరళమైన విధానానికి పేరుగాంచిన గంగాఖేద్కర్ చెబుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు