Covaxin: కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ICMR స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. నివేదికను ప్రచురించిన డ్రగ్ సేఫ్టీ జర్నల్ సంపాదకుడు నితిన్ జోషికి ICMR డీజీ రాజీవ్ బహ్ల్ లేఖ రాశారు. యూనివర్సిటీ తన నివేదికలో.. తప్పుదోవ పట్టించేలా తమ పేరును తప్పుగా ఉటంకించినట్టుగా పేర్కొంటూ సవరణ వేయాలని సూచించింది. లేకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read: పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..!
వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేయాలంటే.. టీకా వేయించుకున్న వారిని, వేయించుకోని వారిని రెండు గ్రూపులు పోల్చిచూడాలన్నారు. 1024 మందిని వ్యాక్సిన్ వేయించుకున్న ఏడాది తర్వాత ఫోన్ చేసి సంప్రదించిన బీహెచ్‌యూ.. 12 నెలల వ్యవధిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా అని అడిగిందన్నారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకుందే తప్ప.. ఎలాంటి వైద్య రికార్డులనూ పరిశీలించి, ధ్రువీకరించుకోలేదన్నారు.