IND vs SA: 'మేం చోకర్స్ అయితే ఇండియా ఏంటి'? తిక్క కుదిర్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్..! దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా రిపోర్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు 'చోక్' ట్యాగ్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. తాము చోకర్స్ అయితే ఇండియా ఏంటని రివర్స్ క్వశ్చన్ వేశాడు. దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకు వరల్డ్‌కప్ సాధించలేదన్న విషయం తెలిసిందే! By Trinath 05 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023: దక్షిణాఫ్రికా జట్టుకు 'చోకర్స్' ట్యాగ్ ఉన్న విషయం తెలిసిందే. 1992లో క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన సౌతాఫ్రికా (South Africa).. నాటి నుంచి నేటి వరకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోతూ వస్తోంది. అందుకే ప్రొటీస్ టీమ్‌కు ఇప్పటివరకు వరల్డ్‌కప్ టైటిల్ లేదు. క్వార్టర్స్, సెమీస్ లేదా ఫైనల్‌లో చోక్ అవ్వడం దక్షిణాఫ్రికాకు అలవాటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అటు క్రికెట్ సర్కిర్స్‌లోనూ ఈ ప్రచారం ఉంది. చోకింగ్ పేరుతో దక్షిణాఫ్రికాను ట్రోల్ చేసే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. ఐపీఎల్‌లో బెంగళూరు టీమ్ ఎలాగో అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా అంతేనంటారు ఫ్యాన్స్. చరిత్ర చూసినా అది నిజమే అనిపిస్తుంది. అందుకే చోక్ ట్యాగ్ దక్షిణాఫ్రికాకు అంటగట్టారు రిపోర్టర్లు. The greatest there was, the greatest there. Forever Legend Temba Bavuma 🫡🔥pic.twitter.com/LXxMW2drBo — Asad 🇵🇸 (@A_sadkermit) November 1, 2023 మేం చోకర్స్ అయితే ఇండియా ఏంటి? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (Temba Bavuma) రిపోర్టర్లకు చురకలంటించాడు. చోకర్స్ ట్యాగ్ వేసిన రిపోర్టర్‌ను ప్రశ్నించాడు. ఇండియా (India) కూడా చోకర్స్ కదా అంటూ కౌంటర్ వేశారు. నిజానికి 2013 ఛాంపియన్స్ ట్రోఫి విక్టరీ తర్వాత ఇండియా ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకోలేదు. ముఖ్యంగా సెమీస్‌లో చతికిలపడుతోంది. 2015, 2019 ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లో ఇంటిముఖం పట్టింది. అటు టీ20 వరల్డ్‌కప్‌ల్లోనూ అంతే. బావుమా ఈ విషయాలను గుర్తుపెట్టుకోనే ఈ సెటైర్ వేసినట్లుగా తెలుస్తోంది. This Shot by Bavuma to Haris Rauf was something really 🔥🙌 Bavuma Haris Basher 🥴 pic.twitter.com/WixWb6w0ic — B1LAL (@oyeeebilal) November 3, 2023 1992 నుంచి దక్షిణాఫ్రికా అంతే: దక్షిణాఫ్రికాకు అదృష్టం కూడా ఏం మాత్రం కలిసి రాదు. పైగా బ్యాడ్ లక్ వెంటాడుతుంటోంది. గెలిచే మ్యాచ్‌లు వర్షం వల్ల ఆగిపోవడం.. డక్‌వర్త్‌లుయిస్ పద్ధితిలో ఓడిపోవడం.. లేదా కీలక సమయంలో రన్ ఔట్లు అవ్వడం వారి దురదృష్టానికి నిదర్శనం. 1992 ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా సెమీస్‌లో ఓడిపోయింది. సౌతాఫ్రికా ఓటమికి వర్షం రావడమే కారణం అంటారు ఆ జట్లు మాజీ ఆటగాళ్లు. డక్‌వర్‌లయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఓడిపోయింది. 1999లో సెమీఫైనల్‌లో అలన్ డొనాల్డ్ అప్రసిద్ధ రనౌట్ గురించి అందరికి తెలిసిందే. 2007 సెమీఫైనల్‌లో ఆసీస్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. 2011 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా.. 2015 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో మరోసారి బోల్తా పడింది. అందుకే దక్షిణాఫ్రికాకు 'చోక్' ట్యాగ్ పడింది. Also Read: సింగిల్ హ్యాండ్‌తో భారీ సిక్సర్.. ఇన్నాళ్లు ఈ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు భయ్యా! #icc-odi-world-cup-2023 #temba-bavuma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి