క్రికెట్ ఫ్యాన్స్‌కి అలెర్ట్.. వరల్డ్ కప్‌ టికెట్ల అమ్మకాలు ఎప్పటి నుంచంటే..?

ఏ ఏడాది అక్టోబర్‌ 5నుంచి మొదలుకానున్న వన్డే ప్రపంచ కప్‌ టికెట్లపై కీలక్‌ అప్‌డేట్‌ వచ్చింది. జులై 31న టికెట్‌ ధరలు ఫైనల్‌ అవుతాయని సమాచారం. అటు ఆన్‌లైన్‌లో మ్యాచ్‌ టికెట్లను ఆగస్టు 10నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి.

క్రికెట్ ఫ్యాన్స్‌కి అలెర్ట్.. వరల్డ్ కప్‌ టికెట్ల అమ్మకాలు ఎప్పటి నుంచంటే..?
New Update

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌(ICC ONE DAY WORLD CUP)కి సమయం దగ్గర పడుతోంది. ఈసారి టోర్ని ఇండియాలోనే జరగనుండడంతో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్‌(schedule) ప్రకటించినప్పటి నుంచి సంబంధిత వేదికలకు సమీపంలోని హోటల్‌ రూమ్స్‌ బుక్‌ చేసుకునే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. ఇక క్రికెట్ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు హోటల్‌ ఓనర్లు ఇప్పటికే తమ రూమ్‌ ధరలు అమాంతం పెంచేశారు.. అయినా కూడా ఫ్యాన్స్‌ తగ్గేదేలా అంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మరీ రూమ్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఇక మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల(ticket) అమ్మకాలపై కీలక అప్‌డేట్‌ వచ్చింది.

టికెట్ సేల్స్‌ ఎప్పటినుంచి?
ఈ ఏడాది ప్రపంచ కప్‌కి సంబంధించి టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది బీసీసీఐ. టికెట్ల ధరలపై ఆతిథ్యం ఇస్తున్న అన్ని అసోసియేషన్ల నుంచి సూచనలను కోరింది. వచ్చే నెల (ఆగస్ట్‌) 10 నుంచి టికెట్ల అమ్మకాలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టికెట్ ధరలపై జులై 31న క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది. అటు టికెట్లను మొత్తం ఆన్‌లైన్‌లోనే విక్రయించాలన్న డిమాండ్‌ వినిపిస్తుండగా.. అది సాధ్యం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అటు టికెట్ల విషయంలో నిబంధన ప్రకారం, ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI) ఒక్కో గేమ్‌కు 300 హాస్పిటాలిటీ టికెట్‌లను ఉచితంగా పొందుతాయి. లీగ్ మ్యాచ్‌ల కోసం 1,295 టికెట్‌లను, సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు 1,355 టికెట్‌లను ఐసీసీకి అందించాలి. మరోవైపు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్‌ బోర్డుల నుంచి బీసీసీఐకి ఈ విషయంపై లేఖలు అందాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజు గ్యాప్‌లో కొన్ని జట్లకు మ్యాచ్‌లను నిర్వహించడంపై అభ్యంతరాలు వచ్చాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు కనీసం 4 రోజులైనా టైమ్‌ ఉండగా..మిగిలిన జట్లకు అలా లేదన్నది ప్రధాన విమర్శ. దీంతో అన్ని జట్లకు సమన్యాయం చేసే విధంగా ప్రస్తుత షెడ్యూల్‌ని రీషెడ్యూల్‌ చేయనుంది బీసీసీఐ. దీని గురించి ఇప్పటికే బోర్డు పెద్దలతో బీసీసీఐ సెక్రటరీ జయ్ షా చర్చించారు. అటు టీమిండియా-పాక్‌ మ్యాచ్‌ కూడా రీషెడ్యూల్‌ అయ్యే ఛాన్స్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా లీగ్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం గుజరాత్‌ వ్యాప్తంగా నవరాత్ర ఉత్సవాలు అదేరోజు ప్రారంభం కానుండడం.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe