World Cup: 'కెప్టెన్సీ అంటే పూలపానుపు కాదు..' చేతకాకపోతే తప్పుకో..!

జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే పూల పానుపు కాదని.. ఒత్తిడిని తట్టుకుంటూ జట్టును మందుండి నడిపించాలంటున్నాడు పాక్‌ లెజెండరీ ప్లేయర్‌ షాహీద్‌ అఫ్రిది. అఫ్ఘాన్‌ చేతిలో పాక్‌ ఓటమికి కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ని బాధ్యుడిని చేస్తూ ఆ జట్టు మాజీ ప్లేయర్లు మండిపడుతున్నారు. బాబర్‌ అజామ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్‌ కూడా మరోవైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది.

World Cup: 'కెప్టెన్సీ అంటే పూలపానుపు కాదు..' చేతకాకపోతే తప్పుకో..!
New Update

వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. గెలిచినప్పుడు ఒకలా.. ఓడిపోయినప్పుడు మరోలా ఉంటుంది. ఈ వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లను పాక్ గెలుచుకుంది. తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా ఇండియాపై జరిగిన పోరులో ఓడిపోయింది. భారత్‌పై ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై మాజీలు మండిపడ్డారు. బాబర్‌ కెప్టెన్సీ ఏం బాగోలేదని విమర్శించారు. అసలు ఒక స్ట్రాటజీ లేకుండా బరిలోకి దిగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఇండియాపై ఓటమి తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోయింది. అంటే హ్యాట్రిక్‌ ఓటములు అన్నామాట. ఇది ఆ జట్టు ఫ్యాన్స్‌ను తెగ బాధపెడుతుండగా.. మాజీలకు మాత్రం కోపం తెప్పిస్తోంది.

publive-image బాబర్ అజామ్ (లెఫ్ట్), అఫ్రిది( రైట్)

ఇదేం ఫీల్డ్ సెట్ ?
పసికూన అఫ్ఘాన్‌పై పాకిస్థాన్‌పై ఓడిపోవడంతో బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరిగింది. అఫ్గాన్‌ బ్యాటర్లకు బాబర్‌ సెట్ చేసిన ఫీల్డింగ్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే వాళ్లు ఎక్కడా తడపడకుండా బ్యాటింగ్‌ చేయగలిగారని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 49 ఓవర్లలో పాక్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే తియ్యగలిగింది. అసలు పసికూన జట్టు పాకిస్థానా లేకా అఫ్ఘానిస్థానా అన్న అనుమానం కలిగిలే మ్యాచ్‌ సాగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్‌ మాజీ ఆటగాళ్లు కెప్టెన్‌ బాబర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే పాక్‌ లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ బాబర్‌పై మండిపడగా..తాజాగా ఈ లిస్ట్‌లో షాహీద్‌ అఫ్రిది వచ్చిచేరాడు.

Also Read: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్‌ మార్క్‌ ‘ఆయుధ పూజ’ ఇది!

అఫ్రిది ఏం అన్నాడంటే?
'జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గౌరవప్రదమైన విషయం కానీ.. అది రోజ్‌ బేడ్‌(Rose Bed) కాదు. మీరు మంచి చేసినప్పుడు, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు చేయనప్పుడు, అందరూ నిందిస్తారు..' ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆఫ్రిది సూచించాడు. నిజానికి చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, ఆస్ట్రేలియాతో పాక్‌ ఓటమిని చవిచూసినప్పటికీ.. అఫ్ఘాన్‌పై ఓటమిని మాత్రం మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి బాబర్‌ కెప్టెన్సీలోనే పాక్‌ వన్డేల్లో నంబర్‌-1 ర్యాంకుకు చేరుకుంది. టీ20 వరల్డ్‌కప్‌ కూడా బాబర్‌ కెప్టెన్సీలోనే సాధించింది. అయితే ప్రస్తుతం బాబర్‌కు గడ్డుకాలం నడుస్తుందనే చెప్పాలి. ఈ విషయంలో జట్టుతో పాటు మాజీ ఆటగాళ్లు అండగా ఉండాలి కానీ.. ఇలా ఒకడినే నిందిండచం కరెక్ట్ కాదన్న వాదన కూడా మరోవైపు నుంచి వినిపిస్తోంది.

Also Read: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్‌ దూరం!

#babar-azam #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe