Shami: కొంచెమైనా సిగ్గు ఉండాలి... పాక్‌ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..!

Shami: కొంచెమైనా సిగ్గు ఉండాలి... పాక్‌ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..!
New Update

ICC WORLD CUP 2023: ఇండియా ఏదైనా సాధిస్తుందంటే చాలు పాకిస్థాన్‌ ఏడుస్తుంటుంది. అది క్రికెట్‌లో కావొచ్చు.. సైన్సులోనైనా కావొచ్చు. వరల్డ్‌కప్‌లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఓటమే ఎరుగని జట్టుగా భారత్‌ నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో అన్నిటిలోనూ గెలిచిన భారత్‌.. తమ చివరి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. భారత్‌ విజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నారు బౌలర్లు. మిగిలిన జట్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పిచ్‌లపై భారత్‌ బౌలర్లు మాత్రం వికెట్లతో విజృంభిస్తున్నారు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ వేస్తూ ప్రత్యర్థి టీమ్‌లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారత్‌ బౌలర్ల దెబ్బకు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు వందలోపే ఆలౌట్ అయ్యాయంటే మన సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అటు ఇండియన్‌ బౌలర్ల టాలెంట్‌ను మెచ్చుకోలని పాక్‌ మాజీ క్రికెటర్‌ రజా వింత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ జట్టు బౌలింగ్‌ టైమ్‌లో ఐసీసీ బంతులు మార్చి ఇస్తుందంటూ అర్థంలేని కామెంట్స్ చేశాడు రజా.. దీనిపై టీమిండియా స్పీడ్ స్టర్‌ షమీ స్పందించాడు.



షమీ ఏం అన్నాడంటే:

రజా వ్యాఖ్యలపై ఇప్పటికే అన్నివైపుల నుంచి విమర్శలు వస్తుండగా.. షమీ తన ఇన్‌స్టా స్టోరీలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కొంచెమైన సిగ్గుండాలి కదా అంటూ కామెంట్స్ చేశాడు. రజా ఎవరి మాట వినకూడదనుకుంటే, పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ చెప్పేది జాగ్రత్తగా వినాలని షమీ చురకలంటించాడు. నిజానికి రజా కామెంట్స్ చేసిన వెంటనే వసీం అక్రమ్‌ స్పందించాడు. వరుస పెట్టి టీమ్‌ ఓడిపోతుంటే తట్టుకోలేక.. బుర్ర పనిచేయక రజా ఈ వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డాడు.



నేను మారను:

వసీం అక్రమ్ క్లాస్‌ పీకిన తర్వాత కూడా రజా ఆగలేదు.. ఈసారి డీఆర్‌ఎస్‌పై పడ్డాడు. ఇండియాకు అనుకూలంగా డీఆర్‌ఎస్‌ టెక్నాలజీని డిజైన్ చేశారంటూ మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు తర్వాత రజా ఈ కామెంట్స్ చేశాడు. డీఆర్‌ఎస్‌ను భారత్ తారుమారు చేస్తోందని రజా ఆరోపించాడు. డిఆర్‌ఎస్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాన్ డెర్ డస్సెన్‌ ఔట్ అనుమానాస్పదంగా ఉందని రజా అభిప్రాయపడ్డాడు. లెగ్ స్టంప్‌పై పిచ్ చేసిన తర్వాత బంతి మిడిల్ స్టంప్‌ను తాకింది. అదెలా సాధ్యం? అని ప్రశ్నించాడు.

Also Read: న్యూజిలాండ్‌కు పట్టిన దరిద్రం అదే.. ఆ గండం దాటితేనే సెమీస్‌కు..!

WATCH: 

#mohammed-shami #pakistan-cricket #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe