IND vs SA: ప్రొటీస్‌ను పేకాడించిన జడేజా.. 100లోపే సఫారీల ప్యాకప్‌..!

వరల్డ్‌కప్‌లో వరుసగా 8వ మ్యాచ్‌లోనూ టీమిండియా విక్టరీ కొట్టింది. దక్షణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది. 327 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జడేజా ఐదు వికెట్ల దెబ్బకు 83 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.

New Update
IND vs SA: ప్రొటీస్‌ను పేకాడించిన జడేజా.. 100లోపే సఫారీల ప్యాకప్‌..!

అద్భుతమేమీ జరగలేదు.. ఇండియా ఈజీగానే మరో మ్యాచ్‌ గెలిచింది. గెలవడం ఇంత తేలిక అన్నట్లు ఇండియా మ్యాచ్‌లు సాగుతున్నాయి. దక్షణిఫ్రికాపై 243 రన్స్‌ తేడాతో ఇండియా విక్టరీ కొట్టింది.


రోహిత్ ధనాధాన్:

టాస్‌ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ తన ఫామ్‌ను కొనసాగించాడు. బాదుడే మంత్రంగా బరిలోకి దూకుతున్న రోహిత్ మరోసారి వేగంగా పరుగులు చేశాడు. రోహిత్‌ ధాటిగా ఆడడంతో టీమిండియా స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే స్ట్రైట్‌ హిట్ బౌండరీకి ప్రయత్నించిన రోహిత్ రబాడా బౌలింగ్‌లో బావుమాకు చిక్కాడు. 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు రోహిత్‌. ఇందులో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత గిల్‌ కూడా పెవిలియన్‌కు చేరడంతో అయ్యర్‌తో కలిసి కోహ్లీ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేశాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఇదే క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నారు. టీమ్‌ స్కోరు 36.5 ఓవర్లలో 227 రన్స్ వద్ద అయ్యర్‌ ఔట్ అయ్యాడు. 87 బంతుల్లో 77 రన్స్ చేసిన అయ్యర్‌ ఎన్గిడి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు.

బర్త్ డే స్పెషల్:

బర్త్‌డే బాయ్‌ కోహ్లీ ఊహించిన విధంగానే సెంచరీ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డును సమం చేశాడు కోహ్లీ. 121 బంతుల్లో 101 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా 300 రన్స్‌ మార్క్‌ను దాటింది. 327 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను టీమిండియా బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ముందుగా షమీ దక్షిణాఫ్రికా బ్యాటర్లను దెబ్బకొడితే తర్వాత జడేజా రెచ్చిపోయి బౌలింగ్‌ చేశాడు. ఏకంగా ఐదు వికెట్లతో దక్షిణాప్రికా ఓటమిని శాసించాడు.

Also Read: Yuvraj Dhoni: నేను కెప్టెన్‌ కావాల్సింది.. ధోనీ నాకు క్లోజ్ కాదు.. యువరాజ్‌ సంచలన వ్యాఖ్యలు! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు