IND vs BAN: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్‌ బాజే..!

టీమిండియా యువ సంచలనం శుభమన్‌ గిల్‌ మరో రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. మరో 67 రన్స్ చేస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్‌ అమ్లా రికార్డు బ్రేక్ అవుతుంది. గిల్‌ వన్డేల్లో 2 వేల రన్స్‌ మార్క్‌ను చేరుకోనున్నాడు. 36 ఇన్నింగ్స్‌లో గిల్ 1933 రన్స్ చేశాడు. అమ్లా 40 ఇన్నింగ్స్‌లో 2వేల రన్స్ చేశాడు.

IND vs BAN: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్‌ బాజే..!
New Update

వరల్డ్‌కప్‌(World cup)లో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రోహిత్(Rohit) సేన మరో విక్టరీకి రెడీ అవుతోంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న పోరులో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారన్నదాని కంటే ఎవరు ఏ రికార్డు బ్రేక్‌ చేస్తారన్నదానిపైనే ఫ్యాన్స్‌ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరితో పాటు యువ ఓపెనర్‌ శుభమన్‌గిల్‌ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్‌ మరో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్‌ అమ్లా(Hashim amla) రికార్డుపైనే కన్నేశాడు.

publive-image అమ్లా (ఫైల్)

గిల్ ఆ రికార్డు బ్రేక్‌ చేస్తాడా?
డెంగీని కోలుకున్న గిల్ గత మ్యాచ్‌లో పాక్‌పై బరిలోకి దిగాడు. వరుస బౌండరీలతో అలరించాడు. అయితే కేవలం 16 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో గిల్‌ మరో రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. మరో 67 రన్స్ చేస్తే అమ్లా రికార్డు బ్రేక్ అవుతుంది. గిల్ వన్డేల్లో ఇప్పటివరుకు 1933 రన్స్ చేశాడు. మరో 67 రన్స్ చేస్తే 2000 పరుగులు పూర్తవుతాయి. గిల్‌ కేవలం 36 ఇన్నింగ్స్‌ ఆడి ఉన్నాడు. గిల్ యావరేజ్‌ 64 ఉంది. 36 ఇన్నింగ్స్‌లో గిల్ 7 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇందులో ఒక డబుల్ హండ్రెడ్‌ కూడా ఉంది. అటు అమ్లా వన్డేల్లో 2 వేల రన్స్ చేయడానికి 40 ఇన్నింగ్స్‌ ఆడాడు. అమ్లా తర్వాతి స్థానంలో జహీర్ అబ్బాస్‌, కెవీన్‌ పీటర్‌సన్‌, బాబర్‌, అజామ్‌ అంతా కూడా 45 ఇన్నింగ్స్‌లలో 2 వేల రన్స్‌ మార్క్‌ను చేరుకున్నారు. ప్రస్తుత గిల్‌ ఫామ్‌ని చూస్తే ఈ రికార్డు బద్దలయ్యేందుకు ఎక్కువ సమయం పట్టేలా కనిపించడలేదు.

publive-image గిల్

గిల్‌ ఈ ఏడాది అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 1,000కు పైగా రన్స్‌ చేశాడు. ప్రస్తుతం గిల్‌ 1,246 రన్స్‌తో ఈ ఏడాది అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. గిల్ కాకుండా ఇంకా ఏ ప్లేయర్‌ కూడా కనీసం 1,000 రన్స్‌ మార్క్‌ను టచ్‌ కాలేదు. వన్డేల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువ రన్స్ చేసిన రికార్డు క్రికెట్ గాడ్ సచిన్‌ పేరిట ఉంది. 1998 క్యాలెండర్‌ ఇయర్‌లో సచిన్ 1,894 రన్స్ చేశాడు. గిల్ ఈ ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. గాయాలు అవ్వకుండా ఉంటే గిల్‌ సచిన్‌ రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు క్రికెట్‌ పండితులు.

ALSO READ: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన హిట్‌మ్యాన్..

#shubman-gill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe