IND VS AUS: 'ఆరే'శారు... 'హెడ్‌' లేపేశాడు.. రన్నర్‌ అప్ తో సరి పెట్టుకున్న భారత్‌..!

అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ.

New Update
IND VS AUS: 'ఆరే'శారు...  'హెడ్‌' లేపేశాడు.. రన్నర్‌  అప్ తో  సరి పెట్టుకున్న భారత్‌..!

ICC WORLD CUP 2023 FINAL: ఫైనల్‌లో నిరాశ.. ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్‌ గెలవాలని భావించిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 'ఆరేసింది.' ఆస్ట్రేలియాకి ఇది ఆరో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌. 1987, 1999,2003,2007,2015,2023 ప్రపంచకప్‌లు గెలుచుకుంది ఆస్ట్రేలియా. అహ్మదాబాద్‌ వేదికగా మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 240 పరుగులు విజయ లక్ష్యాన్ని ఆసీస్‌ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసింది. దీంతో స్టేడియంలోని లక్షా30 వేల మంది అభిమానులతో పాటు కోట్ల మంది భారతీయులు కల చెదిరింది.

రాణించిన కోహ్లీ, రోహిత్:

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ఓపెనర్ రోహిత్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. వేగంగా రన్స్ చేస్తూ ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో గిల్‌ ఔటైనా రోహిత్ ఫోర్లు, సిక్సులు కొట్టడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా వరుస ఫోర్లలతో అలరించాడు. అర్థసెంచరీ వైపు అడుగులు వేస్తున్న రోహిత్‌ 47 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్ లాఫ్ట్ చేయగా.. హెడ్‌ బ్యాక్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి మరి క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో కోహ్లీ, తర్వాత వచ్చిన రాహుల్‌ కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు బౌండరీ కూడా కొట్టలేకపోయారు. దాదాపు 88 బంతులు దాటినా బౌండరీ వెళ్లలేదు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వెంటనే కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు కోహ్లీ. 63 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ స్లోగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 109 బంతుల్లో 66 రన్స్ చేసిన రాహుల్ ఔట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ చెత్తగా బ్యాటింగ్‌ చేశాడు. బౌలర్లకు స్టైక్ ఇస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. చివరకు 50 ఓవర్లలో భారత్‌ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

హెడ్.. వారేవ్వా:

241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలో తడపడింది. ముందుగా వార్నర్, మిచెల్ మార్ష్, స్టిమ్‌ స్మిత్‌ వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లుబూషేన్‌తో జత కలిసిన హెడ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. లుబుషేన్‌ ఓవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా.. మరో ఎండ్‌లో హెడ్‌ వేగంగా పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌ తర్వాత మరింత ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. తర్వాత సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 50 పరుగుల లోపే మూడు వికెట్లు పడగొట్టిన టీమిండియా తర్వాత మరో వికెట్ తియ్యడంలో విఫలమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.

Also Read: ఫైనల్స్‌లో అసలేం జరుగుతోంది.. వామ్మో ఇలా కూడా అవుతుందా?

WATCH:

Advertisment
తాజా కథనాలు