Virat Kohli: 'విరాట్.. ఇంత స్వార్థం పనికిరాదు..' ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్న నెటిజన్లు! న్యూజిలాండ్‌పై జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆటతీరును పలువురు క్రికెట్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ రనౌట్ విషయంలో కోహ్లీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. అటు సెంచరీ కోసమే కోహ్లీ ఆడుతున్నాడంటూ గత రెండు మ్యాచ్‌లుగా అతనిపై విమర్శలు పెరుగుతున్నాయి. జట్టు గెలుస్తుందని తెలిసినప్పటికీ సెంచరీ కాలేదన్న బాధతో కోహ్లీ గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌ని వీడడాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. By Trinath 23 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించడం అతడికి సాధ్యమైనంతగా ప్రస్తుత జనరేషన్ ప్లేయర్లలో ఎవరికి సాధ్యం కాదు. ఛేజింగ్‌లో కోహ్లీని మించిన బ్యాటర్ ఇప్పుడు లేడు. కనీసం దరిదాపుల్లో కూడా లేరు. ఈ వరల్డ్‌కప్(World Cup) ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ విలువేంటో జట్టుతో పాటు ఫ్యాన్స్‌కి మరోసారి తెలిసివచ్చింది. ఆస్ట్రేలియాపై చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరు అద్భుతం. 200 పరుగుల ఛేజింగ్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అవ్వగా.. రాహుల్‌తో కలిసి కోహ్లీ జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో 85 పరుగులు చేసి కోహ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌లుగా కోహ్లీ ఆటతీరు చాలా మందికి నచ్చడం లేదని తెలుస్తోంది. కేవలం సెంచరీ కోసమే ఆడుతున్నాడన్న భావన వచ్చేలా కోహ్లీ బ్యాటింగ్ సాగుతోంది. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా ఇప్పటికే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అటు ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. I respect Kohli but here he became selfish. If Surya was there he couldn't reach near 100.#SuryakumarYadav#INDvsNZ #Kohli pic.twitter.com/QdDOC8KNui — Dr. Abhimanyu Rao (@RaoAbhi124) October 22, 2023 #ViratKohli was going towards the danger end.. But when he realized run is not possible.. He just ran back into his end 😰😰 Pure selfish play from Kohli 👎🏼#CWC23 🏆 #ICCWorldCup2023 #NZvsIND pic.twitter.com/Zf8WRzHh87 — Aamir Mumtaz🌟👑💙 (@thisisaamiir) October 22, 2023 Virat Kohli is the epitome of selfish narcissism. Don't remember seeing such a despicable character (player) in Indian cricket. pic.twitter.com/UhIu5kgTab — RK (@MahiGOAT07) October 22, 2023 Selfish Kohli denied Two runs🤯🫰🏻 pic.twitter.com/oNP3tnatoO — Arshhhhhh (@ArshVAL) October 22, 2023 People are criticising virat Kohli over his allgd selfish playing in the match against NZ. 1. Kohli was looking at the ball while Yadav was looking at Kohli. 2. The reaction of the crowd and Jadeja was quite interesting when Kohli refused for double What do you think?#INDvsNZ pic.twitter.com/tcgZ3trG9p — Humour & Nature Heals (@HumorNatureArt) October 22, 2023 Never seen Rohit Sharma crying for his personal milestones. He scored quick 86 off just 63 balls and left. Selfish Kohli was shouting on the pitch after showing selfish intent. He is the selfless God Rohit Sharma....!!!! pic.twitter.com/vtrPtGyzoU — Rohitified (@emperor_hitman) October 22, 2023 Never seen a more selfish player than chokli 🤬#Kohli #chokli pic.twitter.com/tQ96WMSQi1 — Cricket Universe (@Cricket_Univers) October 22, 2023 రనౌట్‌కి కారణం: బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ అలానే బ్యాటింగ్ చేశాడు. తాను హిట్ చేసినప్పుడు రెండు పరుగులు లేని చోట కూడా దాని కోసం ట్రై చేయగా.. జడేజా ఆడినప్పుడు స్లోగా రన్ చేస్తూ సింగిల్స్ తీశాడు. అటు సూర్యకుమార్ యాదవ్‌ని రన్‌అవుట్ చేసింది కోహ్లీనేనన్న వాదన గట్టిగా అనిపిస్తోంది. సూర్యకు ఇది తొలి వరల్డ్‌కప్ మ్యాచ్. ఇలా వచ్చి అలా రాగానే కోహ్లీ కాల్‌కు స్పందించి పరుగు కోసం ప్రయత్నించిన సూర్యాభాయ్ తర్వాత విరాట్ వెనక్కి వెళ్లిపోవడంతో తన వికెట్‌ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీనిపై ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. 100వ మార్క్ కోసం వేట: ఇక గత రెండు మ్యాచ్‌లుగా కోహ్లీ సెంచరీ కోసమే ఆడినట్టు పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో సెంచరీ కోసం రాహుల్‌ని అవతల ఎండ్‌లో పెట్టి సింగిల్స్ తియ్యకుండా.. ఫోర్లతోనే సెంచరీ చేసుకున్నాడు కోహ్లీ. రాహుల్ సింగిల్ కోసం రావాలని ప్రయత్నించడం మ్యాచ్ చూసిన వారికి క్లియర్‌గా కనిపించింది కూడా. ఓవర్ చివరి బంతికి సింగిల్ తియ్యడం.. చివరకు సెంచరీ చేయడంతో అతని ఆటతీరు టీమ్‌కోసం కాకుండా స్వార్థం కోసం ఉన్నదన్న వాదనను పెంచేలా చేసింది. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లోనూ 95 పరుగుల వద్ద భారీ షాట్‌కి ప్రయత్నించి కోహ్లీ అవుట్ అయ్యాడు. అయినా అప్పటికీ టీమిండియా విజయం కన్‌ఫామ్ ఐపోయింది. కానీ కోహ్లీ మాత్రం గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌ని వీడాడు. ఇండియా ఓవైపు గెలుస్తుంటే కోహ్లీ ఇలా ఎందుకు బాధపడ్డాడని .. జట్టు గెలిస్తున్నప్పుడు ఆనందపడాలి కదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. Also Read: సచిన్, కోహ్లీ, రోహిత్ వల్ల కూడా కాలేదు! గిల్ ఏం సాధించాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు! #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి