/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amitab-1-jpg.webp)
ICC WORLD CUP 2023: ఇండియాలో క్రికెట్ ఓ మతం. అందుకే ఈ గేమ్ చుట్టూ ప్రజలకు అనేక నమ్మకాలు ఉంటాయి. మ్యాచ్ చూస్తున్న సమయంలో తినకూడదని.. ఆ టైమ్‌లో బయటకు వెళ్లకూడదని.. ఇంకా సిట్టింగ్ పొజిషన్ మార్చకూడదని.. ఇలా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఇవి ప్రాక్టికల్‌గా వర్క్ కావు.. కానీ నమ్మకాలకు లాజిక్స్ ఉండవు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. నవంబర్ 19న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు పూజలు చేస్తున్నారు. ఇలా ఎవరి సెంటిమెంట్లను వాళ్లు ఫాలో అవుతుండగా.. ట్విట్టర్‌లో బిగ్ బి అమితాబ్(amitabh bachchan) పెట్టిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.
T 4831 - when i don't watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023
Amitabh Bachchan sir, please be like this on Sunday. pic.twitter.com/A7hpPL0Tfa
— Zucker Doctor (@DoctorLFC) November 15, 2023
అందుకే గెలిచాం:
తాను మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుందంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. అమితాబ్‌ను మ్యాచ్ చూడొద్దని ఫన్నీగా ట్వీట్లు పెడుతున్నారు. అటు బిగ్ బి కూడా ఈ ట్వీట్ కామెడీగానే చేయడంతో అంతా కలిసి ఆయనపై జోకులు పేల్చుతున్నారు. మీరు స్టేడియంలో కానీ, టీవీలో కానీ ఎక్కడా కూడా మ్యాచ్ చూడొద్దని చెబుతున్నారు. అసలు మీ ఇంటికి తాళాలు వేస్తామంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొరైతే అమితాబ్ కళ్లకు గంతలు కట్టాలని అంటున్నారు. ఇలా సోషల్‌మీడియాలో అమితాత్, టీమిండియా ఫ్యాన్స్ సరదాగా ఆడుకుంటున్నారు.
Dont watch final match please sir 🙏
— Lohith_Rebelified🔥🦖 (@Rebelism_18) November 15, 2023
ఇక వరుస ట్వీట్లతో రియాక్ట్ అయ్యారు అమితాబ్ బచ్చన్. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకావాలా వద్దా అనే దాని గురించి తన సందిగ్ధతను వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టారు. 'అబ్ సోచ్ రహా హూ జాన్ కి నా జాన్!' అని షేర్ చేశారు. దీని అర్థం ఇవన్నీ చూశాక.. మ్యాచ్‌కు రావాలా..? వద్దా..? అని ఇప్పుడు నిజంగానే ఆలోచిస్తున్నానని అమితాబ్ మీనింగ్. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు వైరల్‌గా మారాయి. నవంబర్ 19న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే!
Also Read: ‘తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..’ తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!