AUS vs NED: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్‌ గెలుపుతో సెమీస్‌ రేస్‌లోకి ఆసీస్!

వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ దుమ్మురేపింది. నెదర్లాండ్‌పై పోరులో 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

AUS vs NED: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్‌ గెలుపుతో సెమీస్‌ రేస్‌లోకి ఆసీస్!
New Update

నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఏకంగా 309 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఇది ప్రపంచ క్రికెట్‌లో పరుగులు పరంగా రెండో అతి పెద్ద విజయం. ఈ ఏడాడి శ్రీలంకపై భారత్‌ 317 రన్స్‌తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విజయంతో ఆసీస్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌-4కి దూసుకొచ్చింది. అది కూడా పాజిటివ్‌ రన్‌రెట్‌తో. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేట్‌ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. అటు రెండు,మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి.



వార్నర్‌ అదరహో:

ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ త్వరగానే అవుటైనా మరో ఓపెనర్‌ వార్నర్‌ సెంచరీతో చెలరేగాడు. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి 132 పరుగుల పార్ట్‌నెర్‌షిప్‌ని నెలకొల్పాడు. 68 బంతుల్లో 71 రన్స్ చేసిన స్మిత్‌.. అర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లబూషెన్‌తో కలిసి కూడా వార్నర్ సూపర్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు. లబూషెన్‌ ధాటిగా ఆడాడు. 47 బంతుల్లో 62 రన్స్ చేసిన లబూషెన్‌ లీడే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక కాసేపటికి వార్నర్‌ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 93 బాల్స్‌లో 104 రన్స్ చేసిన వార్నర్‌ని వ్యాన్‌బీక్‌ అవుట్ చేశాడు.



మాక్స్‌వెల్‌ వీరవీహారం:

వార్నర్ అవుట్‌ తర్వాత బరిలోకి దిగిన మాక్స్‌వెల్‌ నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ చేశాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీ చేశాడు. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 240 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు మాక్స్‌వెల్‌. వార్నర్‌, మ్యాక్సి సెంచరీలతో 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను స్పిన్నర్‌ అడమ్‌ జంపా దెబ్బకొట్టాడు. 3 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చిన జంపా నాలుగు వికెట్లు తీశాడు. జంపా దెబ్బకు 21 ఓవర్లలో 90 పరుగులకే నెదర్లాండ్స్‌ ఆలౌట్ అయ్యింది.

Also Read: ఇదేం కొట్టుడు సామీ.. వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఫాస్టెస్‌ సెంచరీ..!

#icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe