AUS Vs NZ: కివీస్‌కు 'హెడ్‌'నొప్పి.. కుమ్మేసిన కమ్మిన్స్.. బాదిపడేశారుగా!

బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై జరుగుతున్న పోరులో ఆసీస్‌ 49.2 ఓవర్లలో 388 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్‌ 67 బంతుల్లో 107 రన్స్‌ చేస్తే.. వార్నర్‌ 65 బాల్స్‌లో 81 రన్స్‌ చేశాడు. చివరిలో కమ్మిన్స్‌ కివీస్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 14 బంతుల్లోనే 37 రన్స్ చేయడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది.

AUS Vs NZ: కివీస్‌కు 'హెడ్‌'నొప్పి.. కుమ్మేసిన కమ్మిన్స్.. బాదిపడేశారుగా!
New Update

కమ్మిన్స్ కేక పుట్టించాడు.. హెడ్‌ కివీస్‌ తల లేపేశాడు. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు అదరగొట్టారు. బాదడమే పనిగా వచ్చిన ప్రతి ఒక్కరూ దుమ్మురేపారు. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌ , మిచెల్ స్టార్క్‌, లబూషెన్‌ మినహా ప్రతి ఒక్కరూ వందకు పైగా స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేశారు. హెడ్‌ సెంచరీతో పాటు ప్యాట్ కమ్మిన్స్‌ చివరిలో చెలరేగడంతో ఆస్ట్రేలియా 49.2ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.



హెడ్‌ ధనాధన్‌:

ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ భారీ స్కోరు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. డేవిడ్‌ వార్నర్‌, హెడ్‌ చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. ఇద్దరూ పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ఈ క్రమంలోనే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇద్దరు తొలి వికెట్‌కు 175 రన్స్ జోడించిన తర్వాత వార్నర్‌ అవుట్ అయ్యాడు. 65 బంతుల్లో 81 రన్స్ చేసిన వార్నర్‌ గ్లెన్ ఫిలప్స్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో హెడ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వెంటనే అవుట్ అయ్యాడు. మొత్తం 67 బంతుల్లో 109 రన్స్ చేసిన హెడ్‌ ఫిలప్స్‌ బౌలిగ్‌ అవుట్ అయ్యాడు. హెడ్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మీత్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన లబూషెన్‌ కాస్త స్లోగా ఆడాడు. దీంతో అప్పటివరకు పరిగెత్తిన ఆస్ట్రేలియా స్కోర్‌ బోర్డు.. తర్వాత నడవడం మొదలుపెట్టింది. ఈ ముగ్గురు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్‌ హీరో మ్యాక్స్‌వెల్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. మరోసారి తన ప్రతాపం చూపించాడు. జోష్‌తో కలిసి న్యూజిలాండ్‌ బౌలర్లపై దాడికి దిగాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ నీషమ్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.



కమ్మిన్స్‌ కేక:

ఇక అదే సమయంలో ప్యాట్ కమ్మిన్స్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చి రావడంతోనే కివీస్‌ బౌలర్లని ఉతకడం మొదలుపెట్టాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 14 బంతుల్లోనే 37 పరుగులు చేసిన కమ్మిన్స్‌ని బౌల్ట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మిచెల్‌ స్కార్క్‌, జంపా కూడా పెవిలియన్‌కు చేరడంతో 49.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 388 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Also Read: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్‌! బీసీసీఐ తొండాట..?

#australia-vs-newzealand #cricket #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe