/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-jpg.webp)
వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అఫ్ఘాన్‌పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేజ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అటు ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక కోహ్లీ చివరిలో తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
రాణించిన కెప్టెన్:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన అఫ్ఘానిస్థాన్‌కు ఓపెనర్లు గుర్బాజ్, జాడ్రన్ నిలకడైన స్టార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా టీమిండియా బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. ఇద్దరు పోటి పడి పరుగులు చేశారు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తర్వాత మరింత వేగంగా రన్స్ చేశారు. ముఖ్యంగా షాహిదీ సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. కానీ కుల్దీప్ బంతికి బోల్తా పడ్డాడు. 88 బాల్స్ ఆడిన షాహిదీ 80 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అటు అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేసి పాండ్యా చేతికి చిక్కాడు. పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 272 పరుగులకు పరిమితం అయ్యింది.
రికార్డుల లేపేశాడు.
273 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ శర్మ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఆరంభం నుంచే మంచి దూకుడుగా కనిపించిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాది అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కొట్టిన 93 మీటర్ల సిక్స్ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నమోదైన సిక్సర్లలో భారీ సిక్స్. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు రికార్డు సచిన్ పేరిట ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ ఐపోయింది. వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు ఇది ఏడో సెంచరీ
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన గేల్ రికార్డు కూడా బ్లా్స్ట్ చేశాడు హిట్‌మ్యాన్. ఇక వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్.. ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరుఫున వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక రోహిత్ వీరవీహారంతో పాటు కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో టీమిండియా 35ఓవర్లలోనే టార్గెట్‌ని రీచ్ అయ్యింది.
ALSO READ: నీకు థ్యాంక్స్ సామీ.. గ్యాలరీల్లో అందాలను 30సెకండ్లలో చూపించేశావుగా.. వైరల్ వీడియో..!