IND vs AFG: నీకు థ్యాంక్స్ సామీ.. గ్యాలరీల్లో అందాలను 30సెకండ్లలో చూపించేశావుగా.. వైరల్ వీడియో..! వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కెమెరామ్యాన్ చేసిన ఓ పని సోషల్‌మీడియాను ఊపేస్తోంది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు కెమెరామ్యాన్. దీనికి సంబంధించిన 30 సెకండ్ల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 11 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇండియా(INDIA), అఫ్ఘానిస్థాన్(Afganisthan) మ్యాచ్ జరుగుతున్న సమయం అది.. అఫ్ఘాన్ బ్యాటింగ్ కాస్త చప్పచప్పగా సాగుతోంది. అప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి. 29ఓవర్లలో స్కోరు 137. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా అప్పుడప్పుడే గేర్ మార్చి టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఓవైపు వికెట్ పడడం లేదని గ్యాలరీలో అభిమానులు కాస్త డల్‌గా ఉన్నారు. ఈ పరిణామాలను గమనించిన కెమెరామ్యాన్ తన టాలెంట్‌ని బయటపెట్టాడు. గ్యాలరీల్లో మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను ఓ చూపు చూశాడు. మొత్తం ఆరుగురు కనిపించారు. 30 seconds of cameraman at his best#INDvsAFG pic.twitter.com/xpLp5HGlhI — ° (@imGurjar_) October 11, 2023 వైరల్‌గా మారిన వీడియో: స్టేడియంలో అభిమానులను కాస్త ఖుషీ చేసేందుకు ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కెమెరామ్యాన్లు అమ్మాయిలను బిగ్ స్కీన్‌పై చూపిస్తుంటారు. అలా పాపులర్ అయిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. వారిని సోషల్‌మీడియాలో కొన్ని పేజీలు మీమ్ మెటిరియల్‌గా కూడా వాడుకుంటాయి. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ కెమెరామ్యాన్ ఇదే చేశాడు. మ్యాచ్ 30వ ఓవర్‌లో కేవలం 30సెకండ్లలో గ్యాలరీల్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను చూపించాడు. వెంటనే స్టేడియం హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన 30 సెకండ్ల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దుమ్మురేపుతున్న ఓపెనర్లు: ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా అదరగొడుతోంది. 273 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తున్నాడు. మ్యాచ్ ఇలానే కొనసాగితే టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది. అది అఫ్గాన్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకే జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ డీసెంట్ స్కోరు సాధించింది. ఓపెనర్లు గుర్బాజ్, జాడ్రన్ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇక ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా టీమిండియా బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. ఇద్దరు పోటి పడి పరుగులు చేశారు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తర్వాత మరింత వేగంగా రన్స్ చేశారు. ముఖ్యంగా షాహిదీ సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. కానీ కుల్దీప్ బంతికి బోల్తా పడ్డాడు. 88 బాల్స్ ఆడిన షాహిదీ 80 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అటు అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేసి పాండ్యా చేతికి చిక్కాడు. పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బుమ్రా దెబ్బకు అఫ్ఘాన్ టపాటపా వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చిన బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ALSO READ: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..! #india-vs-afganisthan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి