/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mijeeb-jpg.webp)
స్టేడియంలో ఛైర్స్‌పై కాకి రెట్టలు.. ఎంప్టీ గ్యాలరీలు.. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు.. ఇవేం సరిపోదుంటూ కొత్తగా గ్రౌండ్ నిర్వాహణలోనే బీసీసీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధర్మశాల అవుట్‌ఫీల్డ్ చూసిన ఏ క్రికెటర్‌కైనా.. క్రికెట్ అభిమానికైనా కోపం రాక మానదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల సేఫ్టీకి ఇదేనా మీరు ఇచ్చే ప్రాధాన్యం అని బీసీసీఐని ఫ్యాన్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos buttler) సైతం ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి అవుట్‌ఫీల్డ్‌లో బంతిని ఆపే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నాడు. ఆటగాళ్లు గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు బట్లర్. రేపు(అక్టోబర్ 10) ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్(England vs Bangladesh) మ్యాచ్ ధర్మశాలలోనే జరగనుండగా.. బట్లర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించికున్నాయి. పరోక్షంగా బీసీసీఐకి చురకలు అంటించే విధంగా ఉన్నాయి.
This happened in Dharamsala today!
I hope Mujeeb Ur Rahman isn't badly hurt. #CWC23 #WorldCup2023 pic.twitter.com/jag3OS5PKU— Shobi Cricmedia (@shobiruslan) October 7, 2023
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్ వర్సెస్ అప్ఘానిస్థాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో బాల్‌ని బౌండరీ వద్ద ఆపడానికి అప్ఘాన్ స్పిన్నర్ ముజీబ్(Mujeeb) డైవ్ చేశాడు. అయితే అతని కాలు ఏకంగా అవుట్‌ఫీల్డ్ గ్రౌండ్ లోపలికి వెళ్లింది. కానీ లక్ బాగుండి ముజీబ్‌కి గాయం కాలేదు. ఇది ఒక విధంగా షాకింగ్ విషయమే.. ఎందుకంటే ముజీబ్ చేసిన డైవ్ సేఫ్‌గా జరగలేదు. కేవలం అవుట్‌ఫీల్డ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇది జరిగింది. ఒకవేళ ముజీబ్ గాయపడి ఉంటే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చేవి. ఇప్పుడు కూడా తక్కువ విమర్శలేవి రావడంలేదు అతను గాయపడకపోవడం ఒక విధంగా బీసీసీఐని ఫ్యాన్స్ తిట్టే తిట్లు కాస్త తగ్గాయి.
బీసీసీఐ.. ప్రపంచం మొత్తం చూస్తోంది.. ప్లీజ్:
వరల్డ్ కప్ నిర్వహణ ఇండియాకి కొత్తేమీ కాదు.. 2011 ప్రపంచ కప్ ఆసియా ఖండంలో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఇండియానే ఎక్కువ మ్యాచ్‌లను హోస్ట్ చేసింది. అయినా ఒక్క పోరపాటు కూడా జరగలేదు. ఈ సారి మాత్రం వార్మప్ మ్యాచ్‌ల నుంచే రచ్చ మొదలైంది.. చెప్పాలంటే టికెట్ల కొనుగోల వ్యవహారం నుంచే బీసీసీఐపై ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. నిన్న చెన్నై వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కు స్టేడియంలో కొన్ని సీట్లు ఎంప్టీగా కనిపించాయి. అయితే టికెట్లను విక్రయిస్తున్న 'బుక్‌మైషో' లో సీట్లన్ని ఫీల్ ఐనట్టు కనిపించాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో మండిపడుతున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోవడానికి ఫ్యాన్స్‌ని చీట్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 3న పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు హాజరైన క్రికెట్ విశ్లేషకుడు, కామెంటేటర్ సీ.వెంకటేశ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు తీవ్ర దుమారం రేపాయి. ఇవి పాతవని కొంతమంది వాదించగా.. వెంకటేశ్ మాత్రం ఫ్రూఫ్స్‌లో పోస్ట్ చేశారు. లైవ్‌గా ఫొటోను పోస్ట్ చేశారు. టికెట్‌తో సహా ఫొటోను ట్వీట్ చేశారు. వెస్ట్రన్ టెర్రస్ స్టాండ్స్‌లో కూర్చిలపై పక్షుల రెట్టలు కనిపించాయి. ఇక ఈ తతంగం మరువకముందే ఆటగాళ్ల భద్రతాపైనే ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రత అంటే బయట సెక్యూరిటీ విషయంలో కాదు.. అవుట్‌ఫీల్డ్ విషయంలో...!
ALSO READ: మాయదారి దోమ.. పాక్ మ్యాచ్‌కి టీమిండియా తురుము దూరం..! ప్చ్.. ఇలా జరిగిందేంటి?