World cup 2023: ఆ గ్రౌండ్లో డైవ్ చేస్తే మీ పని గోవిందా.. ఇదేం దరిద్రం భయ్యా.. కెప్టెన్ ఫైర్..!
వరల్డ్‌కప్ నిర్వాహణ విషయంలో బీసీసీఐపై నానాటికి విమర్శలు పెరుగుతున్నాయి. ధర్మశాల అవుట్‌ఫీల్డ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ గ్రౌండ్లో ఫీల్డింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్‌తో పాటు మిగిలిన జట్టు ఆటగాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అఫ్ఘాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బాల్ కోసం ముజీబ్ డైవ్ చేయగా ఏకంగా గ్రౌండ్లో ఇసుక లేచి వచ్చింది. అటు ఐసీసీ(ICC) ప్రతినిధి అవుట్‌ఫీల్డ్ 'రేటింగ్ యావరేజ్' అని చెప్పాడు.