ENG vs BAN: టాప్ లేపిన తోపు.. టోప్లీ దెబ్బకు పూలులు పరార్..! ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ గెలిచింది. టోప్లీ బౌలింగ్‌ను ఫేస్ చేయలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 365 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 227 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో డెవిడ్ మలన్ 140 రన్స్‌తో దుమ్మురేపాడు. By Trinath 10 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిపోయిన ఇంగ్లండ్(England) రెండో మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్(bangladesh)పై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ టోప్లీ దెబ్బకు బంగ్లా బ్యాటర్లు హడలిపోయారు. టార్గెట్ ఛేదనలో బోల్తా పడ్డారు. 364 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 227 రన్స్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లీష్ బౌలర్ టోప్లీ దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటర్లు భయపడ్డారు. 10 ఓవర్లు వేసిన టోప్లీ 43 పరుగులు ఇచ్చిన 4 వికెట్టు పడగొట్టాడు. ఇక క్రిస్ వోక్స్ 2 వికెట్టు తీయ్యగా.. మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీశారు. Reece Topley in his first 3 overs in the World Cup: 1, 0, L1, W, W, 0, 4, 0, 0, 0, L1, 0, 0, 0, 0, W, 0, 0.#ENGvsBAN #WorldCup2023 pic.twitter.com/Bwm1qAMsys — 𝗶𝘀𝗵𝗶.🏴 (@kohlifangirl178) October 10, 2023 బ్యాటింగ్ అదుర్స్: తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు రఫ్ఫాడించారు. ముఖ్యంగా డెవిడ్ మలన్ ఇరగదీశాడు. 107 బంతుల్లో 140 రన్స్ చేశాడు. అందులో 16 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అటు మరో ఓపెనర్ బెయిర్‌స్టో సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. 59 బంతుల్లో 52 రన్స్ చేశాడు బెయిర్‌స్టో. ఇక జో రూట్ క్లాసిక్ బ్యాటింగ్ చేశాడు. 68 బంతుల్లో 82 రన్స్ చేసిన రూట్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అలరించాడు. ఇక బట్లర్ ఉన్నంత సేపు వేగంగా బ్యాటింగ్ చేశాడు. మిగిలిన ప్లేయర్లు చెప్పుకోదగ్గ బ్యాటింగ్ తీరు కనబరచలేదు. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 364 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టాడు. మెహదీ హసన్ 4 వికెట్లు తీశాడు. అయితే దాదాపు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టాప్ లేపిన టోప్లీ: టార్గెట్ ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే తడపడింది. టాన్‌జెద్ హసన్ కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన షంటో, షకీబ్, మిరాజ్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఇక మరో ఓపెనర్ లిట్టన్ దాస్ 66 బంతుల్లో 76 రన్స్ చేశాడు. ఇందులో 2 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. ఇక రహీమ్ 64 బంతుల్లో 51 రన్స్ చేశాడు. తర్వాత టౌహిడ్ 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అప్పటికీ బంగ్లాదేశ్ ఓటమి ఫిక్స్ ఐపోయింది. ముఖ్యంగా టోప్లీ రెచ్చిపోయి బౌలింగ్ వేశాడు. బంగ్లా ప్రధాన బ్యాటర్లు టాన్‌జిద్, షంటో, షకీబ్, రహీమ్‌ను టోప్లీ అవుట్ చేశాడు. ALSO READ: పాక్ బౌలర్ల తుక్కు రేగొట్టిన సింహాలు.. తల బాదుకోవాల్సి వచ్చిందిగా..! #england-vs-bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి