World cup 2023: ఆ జట్టుకు భారీ షాక్‌.. గాయంతో స్టార్ బ్యాటర్‌ దూరం.. ఇలా అయితే కష్టమే..!

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్‌ ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మూడింటిలోనూ గెలిచింది. కచ్చితంగా సెమీస్‌కి వెళ్లే జట్లలో న్యూజిలాండ్‌ ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. గాయంలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌ తర్వాతి జరగబోయే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదని సమాచారం.

World cup 2023: ఆ జట్టుకు భారీ షాక్‌.. గాయంతో స్టార్ బ్యాటర్‌ దూరం.. ఇలా అయితే కష్టమే..!
New Update

వరల్డ్‌కప్‌(World cup) సాధించడం చాలా మంది క్రికెటర్ల కల. కొన్ని జట్లకు అది ఇప్పటికీ కలే. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు దాదాపు ప్రతిసారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగానే బరిలోకి దిగుతుంటాయి. ఈ రెండు జట్లలో స్టార్లకు అసలు ఢోకా ఉండదు. మ్యాచ్‌ విన్నర్లు ఎక్కువగా ఉన్న టీమ్‌లు ఇవి. అయితే ప్రతీసారి వారికి నిరాశే ఎదురవుతుంది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చివరి మెట్టుపై బోల్తా పడింది. అంపైర్ చేసిన చిన్న పొరపాటు న్యూజిలాండ్‌కు కప్‌ దూరం చేసింది. అయితే ఇదంతా క్రికెట్‌లో భాగమేనంటూ ఎంతో స్పొరిటివ్‌గా తీసుకున్న ప్లేయర్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌కేన్‌ విలియమ్‌ సన్‌(Williamson). మనవాళ్లు ముద్దుగా కేన్‌ మావా అని పిలిచుకుంటారు. గత ప్రపంచ కప్‌లో లాస్ట్‌లో చేజారిన అవకాశాన్ని ఈ సారి చేజారనివ్వకూడదని, భారత్‌ గడ్డపై ప్రపంచకప్‌ సాధించాలని ఇండియాలో అడుగుపెట్టాడు విలయమ్‌సన్‌. అయితే అతనికి ప్రస్తుతం కలిసిరావడం లేదని అర్థమవుతుంది.

గాయంతో అవుట్? :

ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ ఫలితాలను చూస్తే న్యూజిలాండ్‌ అందరి కంటే గొప్పగా ఆడుతోంది. పాయింట్ల పట్టికలో కివీస్‌ టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్‌ ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మూడింటిలోనూ గెలిచింది. నెట్‌ రన్‌ రేట్‌ కూడా +1.6గా ఉంది. న్యూజిలాండ్‌ సెమీస్‌కి వెళ్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కేన్‌ విలియమ్‌సన్‌ గాయపడ్డాడు. నిజానికి గతంలో గాయపడ్డ ఇప్పుడా ఆ ఇంజ్యూరీపై కీలక అప్‌డేట్ వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన గ్లోవ్‌కు బాల్ బలంగా తగలడంలో రిటైర్ హార్ట్‌గా వెనుతిరిగిన విలియమ్‌సన్‌ గాయం కాస్త పెద్దదేనని తేలింది. విలియమ్సన్ ఎడమ బొటన వేలికి ఫ్రాక్చర్‌ అయ్యిందని నిర్ధారించారు. గ్రూప్‌ మ్యాచ్‌ల తర్వాత ముఖ్యమైన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం కోసం విలయమ్‌సన్‌కి రెస్ట్ ఇవ్వనుంది కివీస్. అతని స్థానంలో టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు. ఇక టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ మిగిలిన మ్యాచ్‌లను ఆడనుంది.

publive-image బంగ్లాపై మ్యాచ్ లో విలియమ్ సన్ కి గాయం

నిజానికి విలియమ్సన్ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లను ఆడలేదు. బ ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లకు అతను లేడు. టామ్ లాథమ్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ మొదటి రెండు మ్యాచ్‌లను అద్భుతంగా గెలుచుకుంది. తర్వాత బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో కివీస్‌ గెలిచింది. ఆ మ్యాచ్‌లో విలియమ్‌సన్‌ 78 రన్స్ వద్ద ఉన్నప్పడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడనుంది. ఈ మ్యాచ్‌ చెన్నైలో అక్టోబర్ 18న జరగనుంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్‌ ఈ నెల 22న ఆడనుంది.

ALSO READ: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!

#kane-williamson #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe