Viral Video: క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం.. ఈదురుగాలులతో ఊడిపడిన బోర్డు!

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.

New Update
Viral Video: క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం.. ఈదురుగాలులతో ఊడిపడిన బోర్డు!

క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ లక్నో(Lucknow)లోని అటల్ బిహారీ వాజపేయి(atal bihari vajpayee) స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌(Netherlands) వర్సెస్‌ దక్షిణాఫ్రికా(South africa) మ్యాచ్‌ సందర్భంగా ఊహంచని ఘటన జరిగింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలు వీచాయి. ఈ గాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు..


ఓటమి దశగా దక్షిణాఫ్రికా:
ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో ప్రొటీస్‌ టీమ్‌ తీవ్ర కష్టాల్లో పడింది. నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 246 రన్స్‌ టార్గెట్‌ని ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సమయానికి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది. క్రీజులో క్లాసెన్‌, మిల్లర్‌ ఉన్నారు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా స్టార్ట్ అవ్వగా 43ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు.

ALSO READ: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌.. అసలేం జరుగుతోంది?

అంతకముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 43ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. కెప్టెన్‌ అడ్‌వర్డ్స్‌ 69 బంతుల్లో 798 రన్స్‌ చేశాడు. చివరలో వాన్‌ డెర్‌ మెర్వ్‌ 19 బాల్స్‌లో 29 రన్స్ చేశాడు. దీంతో డీసెంట్ టోటల్‌ని సెట్ చేసింది నెదర్లాండ్స్. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, మార్కో జెన్‌సన్‌, రబాడా తలో రెండు వికెట్లు పడగొట్టారు. గెరాల్డ్‌, మహారాజ్‌ ఇద్దరూ తలో వికెట్ తీశారు. అయితే మార్కో జెన్‌సన్‌, మహారాజ్‌ మినహా మిగిలిన బౌలర్లు ఆరుకు పైగా ఎకానమీతో బౌలింగ్ వేశారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఓ సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై అఫ్ఘాన్‌ గెలుపుతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా ఓడిపోతే అది మరో సంచలనంగా నిలిచిపోతుంది.

ALSO READ: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు