IND vs AUS: టీమిండియా పాలిట శని.. ఆ అంపైర్‌ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గెలవలేదు..!

New Update
IND vs AUS: టీమిండియా పాలిట శని.. ఆ అంపైర్‌ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గెలవలేదు..!

క్రికెట్‌ అభిమానులకు సెంటిమెంట్లు ఎక్కువ. మ్యాచ్‌ విషయంలో అనేక లెక్కలు తీస్తుంటారు. చాలా మంది జ్యోతిష్యులు లాగా మారిపోయి ఏంటేంటో మాట్లాడుతుంటారు. కొన్ని వింత లెక్కలు చూపించి ఇండియా గెలుస్తుందని కొంతమంది చెబుతుంటే.. మరికొందరు ఇండియా ఓడిపోవడానికి కారణం అయ్యే లెక్కలు తీస్తున్నారు. ఈ లెక్కల సంగతి పక్కన పెడితే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్న రిచర్డ్ కెటిల్‌బరోపై మీమ్స్ పేలుతున్నాయి. అతను వ్యవహరించిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇండియా ఓడిపోవడమే దీనికి ప్రధాన కారణం. నవంబర్‌ 19న ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు అంపైర్లుగా రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌ వ్యవహరించనున్నారు.

2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇండియా ఓడపోయింది. ఆ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో ఇయర్‌ గోల్డ్‌తో కలిసి అంపైర్‌గా వ్యవహరించాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇండియా ఆస్ట్రేలియాపై ఓడింది. ఆ మ్యాచ్‌లో కుమార ధర్మసేనతో కలిసి రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా వ్యవహరించాడు. 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంటిముఖం పట్టగా.. ఆ మ్యాచ్‌లోనూ ఇయర్‌ గోల్డ్‌తో కలిసి రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు. ఇక పాకిస్థాన్‌పై ఇండియా ఓడిపోయిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో కివీస్‌పై ఇండియా ఓడిపోగా ఆ మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరో. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌లోనూ ఇండియా ఓడిపోతుందా అంటూ ఫ్యాన్స్ సరదగా మీమ్స్‌ వేస్తున్నారు.

Also Read: మరువలేని జ్ఞాపకాలు.. ‘ధోనీ…’ చెవుల్లో ఇంకా మోగుతున్న రవిశాస్త్రి కామెంటరీ!

Advertisment
తాజా కథనాలు