IND VS AUS: టెన్షన్‌..టెన్షన్.. ఆ ఒక్క మార్పుతో భారత్‌ జట్టు? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..!

ప్రపంచక్రికెట్‌లో అత్యుత్తమ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు(నవంబర్ 19) అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తలపడనుండగా.. భారత్‌ తుది జట్టులో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. సిరాజ్‌ స్థానంలో అశ్విన్‌ లేదా శార్దూల్‌ జట్టులోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.

New Update
IND VS AUS: టెన్షన్‌..టెన్షన్.. ఆ ఒక్క మార్పుతో భారత్‌ జట్టు? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..!

ICC WORLD CUP 2023: టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నారు... మ్యాచ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా అని అంతా ఎదురుచూస్తున్నారు.. దేశమంతా ఒక్కటే ఆలోచన.. అదే క్రికెట్.. వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపు(నవంబర్‌ 19) అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్‌ మొదలవనుంది. ప్రధాని మోదీ నుంచి సినీ సెలబ్రెటీలు, క్రికెట్‌ లెజెండ్లు ఈ మ్యాచ్‌ను చూసేందుకు రానున్నారు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఈగెర్‌గా వెయిట్ చేస్తోంది. ఈ రెండు జట్లకు కేవలం వారి దేశాల్లోనే కాకుండా క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ అభిమానులున్నారు. దీంతో రేపటి మ్యాచ్‌కు వ్యూయర్‌ షిప్‌ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రేపటి మ్యాచ్‌లో టీమిండియా ఏదైనా మార్పులతో బరిలోకి దిగుతుందా లేదా సెమీస్‌ ఆడిన జట్టులోనే గ్రౌండ్‌లోకి దూకుతుందా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

ఆ ఒక్క మార్పు చేస్తారా?
ఈ వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాపైనే ఇండియా ఆడిన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన పోరులో రాహుల్‌, కోహ్లీ అద్భుత ప్రదర్శనతో భారత్‌ గెలిచింది. ఆ మ్యాచ్‌లో వెటరన్ స్పిన్నర్‌ అశ్విన్‌ భారత్ తుది జట్టులో ఉన్నాడు. ఆ తర్వాత ఏ మ్యాచ్‌లోనూ అశ్విన్‌ టీమ్‌లో ఆడలేదు. మరోవైపు హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ ఈ వరల్డ్‌కప్‌లో అంతక ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడికి రెస్ట్ ఇచ్చి అశ్విన్‌ని ఆడించాలన్న వాదన వినిపిస్తోంది. అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది చెప్పలేం. ఎందుకంటే గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ పిచ్‌ పేసర్లకు అనుకూలించింది. అహ్మదాబాద్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 244 పరుగులకు ఆలౌటైంది. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. పేసర్లకు ఈ పిచ్‌ కాస్త కలిసి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు సహకరించే ఛాన్స్ ఉండొచ్చు. మరి అశ్విన్‌ని తీసుకుంటారా అంటే చెప్పలేం.


ఫుల్‌ ఫామ్‌లో టీమిండియా:
ఓపెనర్లగా రోహిత్, గిల్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా రోహిత్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జట్టు గెలుపుల్లో రోహిత్‌ ఇంపాక్ట్‌ అందరికంటే ఎక్కువగా ఉంది. వేగంగా బ్యాటింగ్‌ చేస్తుండడంతో తర్వాత దిగే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా ఆడుతున్నారు. 10 మ్యాచ్‌ల్లో 550 పరుగులు చేసిన రోహిత్‌ ఏకంగా 124 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అటు గిల్‌ కూడా రాణిస్తున్నాడు. ఇక వన్‌ డౌన్‌లో విరాట్‌ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీలతో పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే 700కు పైగా పరుగులు చేసిన కోహ్లీ ఫైనల్‌లోనూ రాణిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక శ్రేయర్‌ అయ్యర్‌, కేఎల్‌రాహుల్‌ టీమండియా మిడిలార్డర్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. అయ్యర్‌ దూకుడు బ్యాటింగ్‌ చేస్తుండగా.. అటు రాహుల్‌ సందర్భాన్ని బట్టి తనశైలిని మార్చుకుంటూ జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అడు 360 డిగ్రి ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రెచ్చిపోతే బ్యాటింగ్‌లో టీమిండియాకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో పేసర్‌ షమీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కెరీర్‌లో భయంకర ఫామ్‌లో ఉన్న షమీ.. ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుతున్నాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టిన షమీ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇక బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న బుమ్రా ఇరగదీస్తుండగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. ఇక అటు ఆస్ట్రేలియా కూడా సెమీస్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది.


టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్/అశ్విన్.

ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.

Also Read:  ఏపీ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ న్యూస్‌.. మ్యాచ్‌ చూసేందుకు పెద్ద స్క్రీన్లు.. ఫ్రీ ఎంట్రీ!

WATCH:

Advertisment
తాజా కథనాలు