ICC WORLD CUP గ్రూప్ మ్యాచ్‌లు గెలిచేశాం, సెమీస్‌లో కివీస్‌ను మట్టికరిపించేశా.. ఇంకేముంది ఫైనల్ కూడా గెలుపు తమదేనని ఫిక్స్ అయ్యాం. కానీ ఫైనల్‌కు వచ్చిన జట్టు ఎలాంటిది.. వాళ్ల స్ట్రాటజీ ఏంటి.. మనం ఛేంజ్ చేసుకోవాల్సిన ప్లాన్లు ఏంటి లాంటి వాటిపై ఫోకస్ చేయలేదు. కివీస్‌పై మ్యాచ్‌లో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించినా దాని గురించి ఆలోచించలేదు. అదే టీమ్, అదే స్ట్రాటజీ.. ఇదే టీమిండియా ఫైనల్ ఓటమికి ప్రధాన కారణం.
ఇండియా చేసిన ఐదు తప్పిదాలు
1) ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీ:
గ్రూపు మ్యాచ్‌ల్లో ఈ స్ట్రాటజీతో గెలిచేశాం.. న్యూజిలాండ్‌పై సెమీస్‌లోనే మ్యాచ్‌లో ఇది మైనస్ అని తేలింది.. ఒక బౌలర్ ఫెయిలైతే పార్ట్‌టైమ్ బౌలర్లు లేడు.. 2004కు ముందు ఇండియాకు సచిన్, 2009-2011 మధ్య యువరాజ్ ఆరో బౌలర్‌గా జట్టుకు విజయాలు అందించారు. ఇప్పుడు ఆ పార్ట్‌టైమ్ బౌలర్ లేడు.. చచ్చినట్టు ఐదుగురు బౌలర్లతోనే 50 ఓవర్లు వెయించుకోవాలి. ఇది ఫైనల్‌లో వర్కౌట్ కాలేదు. నిజానికి సెమీస్‌లోనూ ఇది ఫెయిల్ అయ్యింది. కానీ లక్ష్యం భారీగా ఉండడంతో కివీస్ ఓటమిపాలైంది
2) ఆల్‌రౌండర్లు లేరు
ఆస్ట్రేలియాకు మ్యాక్స్‌వెల్ ఈ వరల్డ్‌కప్‌లో 398 రన్స్ చేశాడు.. ఆరు ప్రధాన వికెట్లు తీశాడు.. పాండ్యా గాయపడితే ఇంకో ఆల్‌రౌండర్ లేకుండా పోయింది. శార్దూల్ ఠాకూర్ ఏమంత ఆల్‌రౌండర్ కాదు.. ఒక ఆల్‌రౌండర్ ఉంటే ఆరో బౌలర్ కొరత తీరేది. 2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ యువరాజ్‌కే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చిందన్న విషయం మరువద్దు. అటు ఈ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఓపెనర్ హెడ్ సైతం బౌలింగ్‌లో మెరవడం విశేషం.
3) రివర్స్ స్వింగ్ వేసేవాడే లేడు.
బంతి పాత పడ్డాక రివర్స్ స్వింగ్ వేసే బౌలర్ ఇండియాకు లేడు. జహీర్ ఖాన్ రిటైర్‌మెంట్ తర్వాత పాత బంతితో రివర్స్ స్వింగ్ వేసేవాడు లేకుండా పోయాడు.. షమీ, బుమ్రా కొత్త బంతితో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ వేస్తారు.. కొత్త బంతి సహజంగానే స్వింగ్ అవుతుంది.. మరి పాత పడిన తర్వాత పరిస్తితి ఏంటి? నిన్న మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్ రివర్స్ స్వింగ్‌తోనే ఇండియాను బోల్తా కొట్టించాడు.
4) అతి జాగ్రత్త:
40 ఓవర్లలో నాలుగు ఫోర్లా? మొదటి 10 ఓవర్లలో 9 ఫోర్లు, తర్వాత 40 ఓవర్లలో 4 ఫోర్లు కొట్టింది ఇండియా. పిచ్ ఏమంత భయంకరంగా లేదు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. స్ట్రైక్ రొటేట్ చేయకుండా అతి జాగ్రత్తకు పోయి ఇండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ పరమజిడ్డుతో నాన్ స్ట్రైకర్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. 10-40 ఓవర్ల మధ్య నలుగురు ఫిల్డర్లు బౌండరీ దగ్గర ఉన్నా.. సింగిల్స్
తియ్యలేదు రాహుల్.
5) సెలక్షన్:
గత ఆరేళ్లలో నాలుగు వన్డేలే ఆడిన అశ్విన్‌ను వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయడం వెనుక కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికి బోధపడలేదు. ఈ వరల్డ్ కప్‌లో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచే ఆడించారు. నిజానికి ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. ఇదే కారణంతో ఆస్ట్రేలియాతో గ్రూప్ స్టేజీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆడించారు. ఇదే ఆస్ట్రేలియా ఫైనల్‌కు వస్తే అతడిని పట్టించుకోలేదు. ఫామ్‌లో లేని సిరాజ్‌నే ఆడించారు. ఇక వన్డేల్లో సూర్యకుమార్‌యాదవ్ రెండేళ్లుగా అట్టర్‌ఫ్లాప్ అవుతున్నా.. అతడిని ప్రపంచకప్‌లో సెలక్ట్ చేయడమే కాకుండా పాండ్యా గాయం తర్వాత జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లో ఆడించారు. వరుసగా ఫెయిల్ అవుతున్నా ఫైనల్‌లో కూడా ఆడించారు.
Also Read: వచ్చే వరల్డ్‌కప్‌లో వీళ్లు టీమిండియాలో ఉంటారా.. డౌటే..
WATCH: