Rohit Sharma: రోహిత్‌కి సెంచరీల పిచ్చి లేదు..రికార్డుల కోసం ఆడడు.. ప్రూఫ్స్‌ ఇవే..!

Rohit Sharma: రోహిత్‌కి సెంచరీల పిచ్చి లేదు..రికార్డుల కోసం ఆడడు.. ప్రూఫ్స్‌ ఇవే..!
New Update

'రోహిత్‌ శర్మ సెంచరీల కోసం ఆడడు.. అతనో సెల్ఫ్‌లెస్‌ లీడర్‌' అంటూ కితాబిచ్చాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్. లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ మరోసారి జట్టును కాపాడాడు. ఓవైపు మిగిలిన భారత్‌ బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు కోల్పోతుంటే మరోవైపు రోహిత్ శర్మ మాత్రం ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గిల్, కోహ్లీ, శ్రేయర్‌ అయ్యార్‌ వికెట్లను ఆదిలోనే కోల్పోయిన టీమిండియాను రాహుల్‌తో కలిసి రక్షించాడు. మొత్తంగా 100 బంతుల్లో 87 పరుగులు చేసిన రోహిత్‌ సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో అవుట్ అయ్యాడు.


సెంచరీల కోసం ఆడడు:
రోహిత్‌ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌పై తనదైన స్టైల్‌లో స్పందించాడు గౌతమ్‌ గంభీర్‌. రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు సాధించి ఉండేవాడని.. అయితే అతనికి సెంచరీల మీద వ్యామోహం లేదన్నాడు గంభీర్. రోహిత్ సెల్ఫ్‌లెస్‌ లీడర్‌ అన్నాడు. కెప్టెన్‌ అంటే ఎలా ఉండాలో రోహిత్‌ని చూసి నేర్చుకోవాలన్నాడు గంభీర్‌. ఏ పీఆర్‌(PR) లేదా మార్కెటింగ్ ఈ నిజాన్ని మార్చలేదని స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ టీమిండియాను ముందు నుండి నడిపించాడని.. పరుగుల పరంగా అతను 10 లేదా 12వ స్థానంలో ఉండవచ్చు కానీ అది మేటర్‌ కాదన్నాడు గంభీర్‌. నవంబర్ 19న వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడడమే రోహిత్ లక్ష్యమని చెప్పాడు. రానున్న మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ ఇదే విధంగా బ్యాటింగ్ చేస్తాడని ఆశిస్తున్నానన్నాడు గంభీర్.


నాలుగు సార్లు 80ల్లో అవుట్:
రోహిత్ సెంచరీల కోసం ఆడడని అటు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రూఫ్స్‌ కూడా చూపిస్తున్నారు. ఈ ఏడాది రోహిత్ శర్మ నాలుగు సార్లు 80ల్లో అవుట్ అయ్యాడు. నిజానికి 80 రన్స్‌ దాటిన తర్వాత రిస్క్‌ ఎందుకని స్లోగా బ్యాటింగ్ చేస్తారు. సెంచరీ కోసం హిట్టింగ్‌ చేయకుండా ఉంటారు. కానీ రోహిత్ శర్మ అలా కాదని.. సెంచరీలను అసలు లెక్కే చేయడని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Also Read: కోహ్లీ వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ రికార్డులు అలా ఉంటాయి మరి!

#rohit-sharma #gautam-gambhir #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe