క్రికెట్(Cricket)ని క్రియేట్ చేసిన దేశం అది. క్రికెట్ ఆట మొదలైందే వారి గడ్డపై. అక్కడ నుంచే మిగిలిన దేశాలకు క్రికెట్ వ్యాపించింది. తెల్లోళ్లు పాలించిన దేశాల్లో క్రికెట్ పేనవేసుకుపోయింది. క్రికెట్‌ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విస్తరించగలిగిన ఇంగ్లండ్.. ఆటలో మాత్రం ఉన్నతశిఖరాలను చేరుకోలేపోయింది. 1975లో వన్డే ప్రపంచకప్ మొదలైతే 2019 వరకు ఇంగ్లండ్ కప్ కొట్టలేదు. అది కూడా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్.. చివరిలో అంపైర్ తప్పిదం కారణంగా గెలవగలిగింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అఫ్ఘాన్ చేతిలో ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది.
ఇంగ్లండ్ చెత్తాట:
వరల్డ్‌కప్ హిస్టరీలో వరుసగా అఫ్ఘాన్ 14 మ్యాచ్‌లు ఓడిపోయింది. 2015 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ టోర్నీలో ఎంట్రీ ఇచ్చిన అఫ్ఘాన్ ఈ సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచే గెలిచింది. అది కూడా స్కోట్లాండ్‌పై. ఇక 2019 ప్రపంచకప్‌లో అఫ్ఘాన్ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అందుకే ఇంగ్లండ్ కూడా అఫ్ఘాన్‌ను తక్కువ అంచనా వేసినట్టు ఉంది. అయితే మ్యాచ్‌లో మాత్రం సీన్ సితార్ అయ్యింది. అఫ్ఘాన్ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఛాలెంజింగ్ టార్గెట్‌ని సేట్ చేసి అఫ్ఘాన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించింది. అఫ్ఘాన్ బౌలర్లను ఎలా ఆడాలో తెలియక ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.
ఇంగ్లండ్‌కు ఇలా జరగడం తొలి సారి కాదు:
క్రికెట్‌లో చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించడం లాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే ఇంగ్లండ్ మాత్రం దీనికి పేటెంట్ రైట్స్‌ని కలిగి ఉంది. 2011 ప్రపంచ్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ ఓడిపోవడం అప్పట్లో పెను సంచలనం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 రన్స్ చేసింది. ఇంకేముందిలే ఇంగ్లండ్ గెలుపు ఈజీ అని అంతా అనుకున్నారు. ఇంగ్లండ్ కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బౌలింగ్ చేసింది. అయితే కేవీన్ ఓ బ్రెయిన్ ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 63 బంతుల్లోనే 113 రన్స్ బాదాడు. ఇందులో ఆరు సిక్సులు కూడా ఉన్నాయి. కెవీన్‌తో పాటు అలెక్స్, జాన్ మూనీ రాణించడంతో ఇంగ్లండ్ 49.1 ఓవర్లలోనే ఆ స్కోరును ఛేజ్ చేసింది. ఇక 2015 ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ మరోసారి పసికూన చేతిలో చావు దెబ్బ తిన్నది. బంగ్లాదేశ్ సేట్ చేసిన 276 రన్స్ టార్గెట్‌ని ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో అఫ్ఘాన్‌పై ఓడిపోయింది. ఇలా వరుస పెట్టి చిన్న జట్ల చేతిలో ఓడిపోవడం ఇంగ్లండ్‌కే చెల్లింది.
ALSO READ: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో!