ప్రపంచకప్(World Cup)లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థుల భరతం పట్టిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. నెట్‌రన్‌రేట్ కూడా మనదే ఎక్కువ. గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పెద్ద జట్లపైనే గెలిచింది భారత్. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన టీమండియా ఇప్పటివరకు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడింటిలోనూ ఇండియాను వేలు పెట్టి ఎవరూ కూడా చూపించలని పరిస్థితి. అటు కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ సక్సెస్ అవుతున్నాడు. బ్యాటర్‌గా రెచ్చిపోయి ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్‌గా ఉండడం టీమిండియాకు అదనపు బూస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటు బౌలింగ్‌లోనూ టీమిండియా ఓ రేంజ్‌లో ఆడుతోంది. అందుకు కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఇందులో ఇండియానే ఫస్ట్:
తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశాం.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌నూ ఆలౌట్ చేశాం.. ఇది భారత్ బౌలర్ల గొప్పతనం. అయితే కేవలం వికెట్లు తియ్యడమే కాదు.. మంచి ఎకానమితో బౌలింగ్ వేయడంలోనూ టీమిండియా తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది. అందుకు ఈ లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు(నిన్నటి ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక) జరిగిన మ్యాచ్‌ల్లోని లెక్కలు చూస్తే టీమిండియా ఎకానమినే అన్నిటికంటే గ్రేట్‌గా ఉంది. భారత్ బౌలర్లు సగటున 4.55 ఎకానమీతో బౌలింగ్ వేశారు. ఇండియా తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఉంది. కివీస్ బౌలర్లు సగటున 5.10 ఎకానమీతో బౌలింగ్ వేయగా.. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సగటున 5.25 ఎకానమీతో బౌలింగ్ వేసంది.
వికెట్లలోనూ టాప్:
కేవలంలో ఎకానమీ పరంగానే కాదు.. వికెట్ల పరంగానూ ఇండియానే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 142.2 ఓవర్లు వేసిన భారత్ 648 రన్స్ మాత్రమే ఇచ్చుకుంది. 28 వికెట్లు తీసింది. యావరేజ్ కూడా గొప్పగా ఉంది. 23.14 యావరేజ్‌తో భారత్ బౌలర్లు దుమ్మురేపుతున్నారు. అటు న్యూజిలాండ్ సైతం బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 146.3 ఓవర్లు వేసిన కివీస్ బౌలర్లు 748 రన్స్ ఇచ్చారు. 27 వికెట్లు తీశారు. యావరేజ్ 27.70గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. మంచి బౌలింగ్ కచ్చితమైన గెలుపును తీసుకొస్తుంది. ఎందుకంటే మ్యాచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్ పిచ్‌లపై జరుగుతున్నాయి. ఈ పిచ్‌లపై బౌలింగ్‌లో అదరగొట్టిన వాడే కింగ్‌గా నిలుస్తాడు. ఇదే ఫామ్‌ని భారత్ కంటిన్యూ చేస్తే ఇండియా వరల్డ్‌కప్ గెలవడం చాలా ఈజీ అంటున్నారు ఫ్యాన్స్!
ALSO READ: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?