World Cup: నెవర్‌ బిఫోర్‌.. పోటెత్తిన అభిమానులు.. వరల్డ్‌కప్‌లో స్టేడియం అటెండెన్స్ చూస్తే మైండ్‌ పోవాల్సిందే!

ఇటీవలే ముగిసిన ప్రపంచ కప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. అత్యధికంగా హాజరైన ఐసీసీ ఈవెంట్‌గా ఈ వరల్డ్‌కప్‌ రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్‌ను మొత్తంగా 12,50,307 మంది అభిమానులు స్టేడియానికి వచ్చి చూశారు.

World Cup: నెవర్‌ బిఫోర్‌.. పోటెత్తిన అభిమానులు.. వరల్డ్‌కప్‌లో స్టేడియం అటెండెన్స్ చూస్తే మైండ్‌ పోవాల్సిందే!
New Update

ICC WORLD CUP 2023: ఇండియాలో క్రికెట్ క్రేజ్‌ గురించి ప్రపంచానికి తెలియనది కాదు.. ఇక్కడ క్రికెట్ ఒక మతం. క్రికెటర్లు దేవుళ్లు.. అందుకే మ్యాచ్‌ గెలవడం కోసం ఎప్పుడు గుడికి వెళ్లని వాళ్లు కూడా ఫైనల్‌కు ముందు ఆలయాలకు క్యూ కట్టారు. ఇండియా గెలవాలని ప్రార్థించారు. ఇక వరల్డ్‌కప్‌ మొదలైన దగ్గర నుంచి దేశంలో క్రికెట్ ఫీవర్ ఉన్నా.. అది పెద్దగా కనిపించలేదు. తొలి మ్యాచ్‌లో హోస్టింగ్‌ కంట్రీ అయిన ఇండియా మ్యాచ్‌ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య జరిగింది. 2019 సెమీఫైనలిస్టులైన ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు స్టేడియానికి రాలేదు. కనీసం ఒక శాతం స్టేడియం కూడా నిండలేదు. అయితే రోజులు గడుస్తోన్న కొద్దీ అభిమానులు స్టేడియానికి రావడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే గత పాత రికార్డులను బద్దలు కొట్టే అంతలా.

Also Read: ‘ఆస్ట్రేలియా టీమ్‌తో కనెక్ట్ ఐపోయా ..’ జూనియర్‌ ఎన్టీఆర్‌ కామెంట్స్ వైరల్!

వరల్డ్‌కప్‌ను ఎంతమంది చూశారో తెలుసా?
ఈ వరల్డ్ కప్ సందర్భంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైనట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. 12 లక్షల 50 వేల 307మంది స్టేడియానికి హాజరై మ్యాచ్‌లు వీక్షించారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్‌ 19 వరకు మొత్తం 12,50,307 మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించారు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో 2015 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో మొత్తం 10లక్షల మంది మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మార్క్‌ను ఇండియా హోస్ట్ చేసిన ఈ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ అధిగమించింది. రన్నరప్‌గా నిలిచిన భారత్‌తో సంబంధం లేని ప్రారంభ మ్యాచ్‌లు వేదికలలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ.. మొత్తం ప్రేక్షకుల సంఖ్య మాత్రం 10 లక్షలు దాటడం విశేషం.

ఆస్ట్రేలియా వర్సెస్‌ భారత్‌ మధ్య జరిగిన ఫైనల్‌కు అటెండెన్స్ ప్రకారం లక్ష మంది హాజరయ్యారు. నిజానికి స్టార్టింగ్‌ మ్యాచ్‌లకు అభిమానులు లేరు. అక్టోబర్‌ 14న ఇండియా వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఇక అఫ్ఘినిస్థాన్‌ పెద్ద జట్లను ఓడించడం ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తడానికి మరో ప్రధాన కారణం. 1.25 మిలియన్లకు పైగా అభిమానుల మ్యాచ్‌ను స్టేడియానికి వచ్చి చూడడం కొత్త బెంచ్‌మార్క్. ఇది ఏ ఇతర ఐసీసీ ఈవెంట్‌ల హాజరు గణాంకాలను అధిగమించింది. అటు ఊహించినట్లుగానే ప్రసార, డిజిటల్ వీక్షకుల రికార్డులను కూడా ఈ వరల్డ్‌కప్‌ బద్దలు కొట్టింది.

Also Read: ‘మోదీ శని టీమిండియాకు తగిలింది..’ రాహుల్‌ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..!

WATCH:

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe