ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటపై సంచలన కామెంట్స్ చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ. మాజీ ప్రదాని ఇందిరాగాంధీ జయంతి రోజున మ్యాచ్ జరగడం వల్లే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా(Team India) ఓడిపోయిందని కామెంట్స్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఇంకా చాలా తీవ్రమైణ వ్యాఖ్యలు కూడా చేశారు. 'ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లలో మన దేశ టీమ్ గెలిచాం. ఫైనల్స్‌లో మాత్రం ఓడిపోయాం. మనం మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామా? అరా తీశాను. ఇందిరా గాంధీ జయంతి రోజునే ప్రపంచ కప్ ఫైనల్ ఆడినట్లు గుర్తించాను. ఆ రోజున ఆడటం వల్లే టీమిండియా ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యింది. అంతేకాదు.. బీసీసీఐ నుంచి నాకు ఒక అభ్యర్థన వచ్చింది. గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజున టీమిండియా ఏ మ్యాచ్ లేకుండా ఉంటే ఉత్తమం. లేదంటే.. ప్రపంచకప్ ఫైనల్స్‌లో జరిగినట్లే జరుగుతుందన్నారు.' అంటూ చెప్పుకొచ్చారు హిమంత బిస్వ శర్మ.
కాగా, నవంబర్ 19న జరిగిన ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిమి అంశానికి రాజకీయం తోడైంది. ఈ వ్యవహారంలో రాజకీయం ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీ 'పనౌటీ' అని సంబోధించారు. ఆయన మోదీ మ్యాచ్ చూడటానికి వెళ్లడం వల్లే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయ్యిందని ఆరోపించారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో.. 'పనౌటీ' అనే పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో కలిసి అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌కు హాజరయ్యారు. ఇక మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో.. వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో రచ్చ చేశారు నెటిజన్లు. 'పనౌటీ' అనే పదం ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అయ్యింది. అయితే, రాజస్థాన్ ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన పనౌటీ కామెంట్స్‌పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read:
బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్..
ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!