Cricket new rule: ఇక తేడా వస్తే ఐదు పరుగులు సమర్పించుకోవాల్సిందే.. ఐసీసీ కొత్త రూల్ ఇదే!

ఐసీసీ మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండకపోతే పెనాల్టీ పడుతుంది. ఇలా చేసిన మొదటి సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో సారి రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ ఇస్తారు.

New Update
Cricket new rule: ఇక తేడా వస్తే ఐదు పరుగులు సమర్పించుకోవాల్సిందే.. ఐసీసీ కొత్త రూల్ ఇదే!

మొన్ననే వరల్డ్‌కప్‌ ముగిసింది. నవంబర్‌ 23 నుంచి ఆస్ట్రేలియాతో ఇండియా టీ20 సిరీస్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌ విశాఖలో జరగనుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్స్‌తో ముందుకు వచ్చింది. ఇక ఈ రూల్‌ ఫాలో అవ్వకపోతే పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు సమర్పించుకోవాల్సిందే.

Also Read: ‘మోదీ శని టీమిండియాకు తగిలింది..’ రాహుల్‌ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..!

కొత్త రూల్ ఏంటి?
ఓవర్‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండాలి. అలా లేకుంటే పెనాల్టీ రన్స్‌ను బ్యాటింగ్‌ టీమ్‌కు ఇస్తారు. అయితే మొదటి రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా ఇదే జరిగితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో స్లో ఓవర్ రేట్ తగ్గిపోనుంది. ఇటీవల కాలంలో కెప్టెన్లకు ఇదే విషయంలో ఫైన్‌ పడుతూ వస్తోంది. ప్రత్యర్థిలను కట్టడి చేసేందుకు ఓవర్ల మధ్య ఎక్కువ సమయం గడుపుతున్నారు కెప్టెన్లు. దీని వల్ల మ్యాచ్‌ లేట్‌గా ముగుస్తోంది. అయితే ఐదు పరుగులు పెనాల్టీ విధించడం రూల్‌ వల్ల కెప్టెన్లు ఇందుకు సాహసించకపోవచ్చు. ఎందుకంటే క్రికెట్‌లో గెలుపోటమల మధ్య డిఫెరన్స్‌ చాలాసార్లు ఒక్క పరుగు మాత్రమే. అలాంటిది ఐదు పరుగులంటే అది మాముల విషయం కాదు. దీంతో.. ప్రతి జట్టు కూడా ఇక నుంచి ఈ రూల్ విషయంలో జాగ్రత్తగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు పిచ్, అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనలకు మార్పులు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఏప్రిల్ 2024 వరకు పురుషుల వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రయల్ ప్రాతిపదికన స్టాప్ క్లాక్‌ని ప్రవేశపెట్టడానికి ఐసీసీ అంగీకరించింది.

Also Read: నెవర్‌ బిఫోర్‌.. పోటెత్తిన అభిమానులు.. వరల్డ్‌కప్‌లో స్టేడియం అటెండెన్స్ చూస్తే మైండ్‌ పోవాల్సిందే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు