ICC: 2023 ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

2023 ప్లేయింగ్ ఎలెవన్‌ టీమ్ లను ఐసీసీ రిలీజ్ చేసింది. ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. వన్డే టీమ్ కు రోహిత్ శర్మ, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, సౌతాఫ్రికా నుంచి ఇద్దరు, న్యూజీలాండ్ నుంచి ఒక్కరికి చోటు దక్కింది.

New Update
ICC: 2023 ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

ICC: 2023 క్యాలెండర్ ఇయర్ లో ఆకట్టుకున్న అత్యుత్తమ 11 మంది ఆటగాళ్ల లిస్ట్ ఐసీసీ రిలీజ్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన వన్డే, టీ 20లకు సంబంధించిన జాబితాను అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit) ICC వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి కెప్టెన్‌గా, సూర్య కుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ గా ఎంపికయ్యారు.

ఆరుగురికి చోటు..
బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ ఉండగా.. పేసర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. అలాగే వన్డే ప్రపంచకప్ లో రాణించిన ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడమ్ జంపా, ట్రావిష్ హెడ్, ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. సౌతాఫ్రికా నుంచి క్లాసెన్, జాన్సెన్ లు చోటు దక్కించుకున్నారు. 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ఏడాది 52 సగటుతో 1255 పరుగులు సాధించాడు. ఇక శుభ్‌మాన్ గిల్ క్యాలెండర్ సంవత్సరంలో 1584 పరుగులు చేశాడు. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 2023 ఆస్ట్రేలియా ఆరవ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ లో 137 పరుగులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు.

బ్యాటింగ్ మాస్ట్రో..
ఇక భారత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ.. 2023లో రికార్డు బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్ లో అతను అత్యధిక ODI సెంచరీలు చేసి సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును అధిగమించాడు. 2023 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ ఐదు సెంచరీలు చేసి 52.34 సగటుతో మొత్తం 1204 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా జట్టులో ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 109 పరుగులతో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రోటీస్ పేసర్ మార్కో జాన్సెన్ గత 12 నెలలుగా బ్యాట్, బాల్ రెండింటిలో అత్యుత్తమ ప్రదర్శనల కారణంగా టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా.. ప్రపంచ కప్ లో వరుసగా మూడు నాలుగు వికెట్లు తీశాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా నిలిచాడు.

ఇది కూడా చదవండి : India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్!

మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లతో కూడిన భారత బౌలింగ్ త్రయం 2023లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సిరాజ్ 2023లో 44 వికెట్లు సాధించగా.. షమీ నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ODI ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 49 వికేట్లతో ఆ సంవత్సరాన్ని ముగించాడు.

ఐసీసీ వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్, భారత్), శుభ్‌మన్ గిల్ (భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్, దక్షిణాఫ్రికా) , మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), మహ్మద్ సిరాజ్ (భారత్), కుల్దీప్ యాదవ్ (భారత్) మహ్మద్ షమీ (భారత్)

ఐసీసీ టీ20 జట్టు..
అలాగే ఐసీసీ వార్షిక ఉత్తమ టీ20 జట్టుకు టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఈ జట్టులో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా చోటు దక్కించుకున్నారు. శ్రీలంకపై మెరుపు శతకం (112 నాటౌట్‌) సహా కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు సూర్య. అతను ఐసీసీ టీ20 జట్టుకు ఎంపిక కావడం వరుసగా ఇది రెండో ఏడాది. ఫిల్‌ సాల్ట్‌ (ఇంగ్లాండ్‌), పూరన్‌ (వెస్టిండీస్‌), సికందర్‌ రజా, ఎంగరవ (జింబాబ్వే), చాప్‌మన్‌ (న్యూజిలాండ్‌), అడైర్‌ (ఐర్లాండ్‌), అల్పేష్‌ రాజమణి (ఉగాండా) ఈసారి జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఉమెన్స్ ODI టీమ్ ..
2023 సంవత్సరానికి ICC ఉమెన్స్ ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఆల్-క్వెరింగ్ ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏ యేడాది చాలా మంది ఆటగాళ్ళు ఆధిపత్యం చెలాయించారు. ODIలో 485 పరుగులతో, 20 ఏళ్ల ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. 53.8 సగటుతో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు చేసింది. మహిళల ODIలలో సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించిన రెండవ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు ఈ ఏడాది ODI ఫార్మాట్‌లో అసాధారణ ప్రదర్శన చేసింది.  69.16 సగటుతో 415 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్‌లో ఆమె కేవలం 80 బంతుల్లో 140 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇద్దరు ఓపెనర్లలో ఒకరిగా ఉమెన్స్ ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో అవకాశం దక్కించుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు