అట్టహాసంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి నామినేషన్

ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ వేశారు. 30 వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వస్తుండగా కాంగ్రెస్ శ్రేణులతో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

New Update
అట్టహాసంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి నామినేషన్

BRS Manchireddy Kishan Reddy Nomination: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా చేసుకున్నారు. 30 వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కని.. విని ఎరుగనిరీతిలో శాస్త్ర గార్డెన్స్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆనంతరం నామినేషన్ వేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. 5 కిలోమీటర్ల దూరం వరకు ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు తరలిరావడంతో గెలుపు ధీమా వ్యక్తం చేశారు. డప్పు దరువులతో యువత కేరింతలు కొట్టారు. బతుకమ్మ, బోనాలతో మహిళా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..!

కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసింది. ఇరు వర్గాలకు చెందిన నేతలు.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) నియోజకవర్గంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెళ్తుంటే.. ఒక పార్టీపై మరొక పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి భారీ ర్యాలీతో నామినేష్ వేయడానికి వెళ్తున్న సమయంలోనే.. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ కోసం బయలుదేరారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల ఘర్షణలతో అలర్ట్ అయిన పోలీసులు.. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు.

Advertisment
తాజా కథనాలు