న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్‌పోర్ట్: 362 పోస్టులు
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్): 315 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 677.
అర్హతలు: ఎంటీఎస్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణతై ఉండాలి. ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700- రూ.69,100. ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 - రూ.56,900 ఇవ్వనున్నారు.
ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్)- ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 14.10.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023.
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16.11.2023.
Also Read: ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!