ట్రాన్స్ఫర్ పై వెళ్తూ ప్యూన్ కాళ్లు మొక్కిన కలెక్టర్..! కింది ఉద్యోగులను బానిసల్లా చూసే అధికారులు ఉన్న ప్రస్తుత సమాజంలో. తమ కన్నా వయసులో పెద్దవారిని కూడా అరేయ్...ఒరేయ్ అనిపిలిచే పొగరుబోతు ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఝార్ఖండ్లోని ఓ ఐఏఎస్ అధికారి తన గొప్పమనసు చాటుకున్నారు. తన ఆఫీసులో పనిచేసిన ప్యూన్ కాళ్లకు మొక్కి..ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా తీవ్ర భావోద్వేగానికిలోనయ్యారు. ఈ దృశ్యంతో అందరి కళ్లు చమర్చాయి. ఒక ఆత్మీయ అధికారిని వదులుకుంటున్నామని కార్యాలయ సిబ్బంది సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. By V. Sai Krishna 29 Jul 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి కింది ఉద్యోగులను బానిసల్లా చూసే అధికార మదాంధులున్నారు. తమ కన్నా వయసులో పెద్దవారిని కూడా అరేయ్...ఒరేయ్ అనిపిలిచే పొగరుబోతు ఆఫీసర్లు ఉన్నారు. ఎంత మంది అధికారులకు తన కింది ఉద్యోగులను తమలాంటి వారేనని భావిస్తారు. ఎంత మంది గౌరవ మర్యాదలతో చూస్తారు. ఝార్ఖండ్లోని ఓ ఐఏఎస్ అధికారి తన గొప్పమనసు చాటుకున్నాడు. బదిలీ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ తన ఆఫీసులో పనిచేసిన ప్యూన్ కాళ్లకు మొక్కి..ఆశీర్వాదం తీసుకున్నారు. మరో ఇద్దరు ప్యూన్లకు శాలువాలు కప్పి చిరు సత్కారం చేశారు. పాలమూ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దొడ్డే దుమ్కా జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పాలమూ కలెక్టర్గా శశిరంజన్ నియమితులయ్యారు. ఈ క్రమంలో దొడ్డే నుంచి శశిరంజన్ పలామూ కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు శశిరంజన్కు అప్పగించిన తర్వాత దొడ్డే తన దగ్గర పనిచేసే నందలాన్ అనే ప్యూన్ వద్దకు వెళ్లి ఎమోషనల్ అయ్యారు. ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తండ్రి కూడా ప్యూన్గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తాను కలెక్టర్గా ఉన్న సమయంలో నందలాల్ తనకు ఎంతో సేవ చేశారని ఐఏఎస్ అధికారి దొడ్డే తెలిపారు. ‘పలామూ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు చాలా అనుభవాలు పొందాను. జిల్లాలో పరిపాలనా యంత్రాంగం బాగుందని.. అభివృద్ధికి కృషి చేస్తోంది. పలామూ కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శశిరంజన్కు శుభాకాంక్షలు' అని తెలిపారు. #gentle-collector మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి