అది అబ్దుల్ కలామ్ అంటే.... ఆయన గొప్ప ధానానికి ఈ ఘటన ఓ గొప్ప ఉదాహరణ...!

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సౌభాగ్య అనే కంపెనీ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని కంపెనీ బలవంతం మీద ఆయన తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆ గ్రైండర్ ధరకు చెక్ రాసి పంపారు. దాన్ని కంపెనీ డిపాజిట్ చేయకపోవడంతో గ్రైండర్ తిరిగి ఇచ్చి వేస్తానని హెచ్చరించారు. దీంతో కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసింది.

author-image
By G Ramu
అది అబ్దుల్ కలామ్ అంటే.... ఆయన గొప్ప ధానానికి ఈ ఘటన ఓ గొప్ప ఉదాహరణ...!
New Update

భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలియని వారు ఉండరు. వృత్తిలో నిబద్దత, ఉన్నతమైన విలువలు పాటిస్తూ ఎంతో మందికి ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచారు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా అత్యంత సామాన్య జీవితం గడిపి ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆయన గొప్ప తనాన్ని వివరించే ఓ ఘటన గురించి ఐఏఎస్ అధికారి ఎమ్.వి. రావు ఓ పోస్టు చేశారు.

2014లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఆ సందర్బంలో అబ్దుల్ కలామ్ కు ఆ సంస్థ ఓ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని తీసుకునేందుకు కలాం నిరాకరించారు. కానీ కంపెనీ బలవంతం చేయడంతో ఆయన ఆ గిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

కానీ ఆ గిఫ్ట్ తీసుకున్నాక ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. వెంటనే ఆ వెట్ గ్రైండర్ మోడల్ వివరాలు చెప్పి దాని మార్కెట్ విలువ తెలుసుకోవాలని తన అసిస్టెంట్ కు కలాం చెప్పారు. దీంతో ఆ అసిస్టెంట్ మార్కెట్ కు వెళ్లి వెట్ గ్రైండర్ ధరను కనుకున్నారు. వెంటనే ఆ మొత్తానికి ఆయన తన పర్సనల్ అకౌంట్ నుంచి చెక్ రాసి ఇచ్చి కంపెనీ ప్రతినిధులకు ఇవ్వాలని అసిస్టెంట్ ను ఆదేశించారు.

కానీ కలాం ఇచ్చిన చెక్ ను కంపెనీ చాలా రోజుల వరకు డిపాజిట్ చేయలేదు. ఈ విషయం కాస్త కలామ్ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఆ చెక్ ను బ్యాంకులో డిపాజిట్ చేసి డబ్బులు తీసుకోవాలని కంపెనీని కోరారు. ఒక వేళ డిపాజిట్ చేయకపోతే తాను ఆ గ్రైండర్ ను తిరిగి పంపిస్తానని హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసిందట. తాజాగా ఆ చెక్కుకు సంబంధించిన ఫోటోను ఐఏఎస్ అధికారి షేర్ చేశారు.

#ias-mv-rao #wet-grinder #check #gift #apj-abdul-kalam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe