తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి క్లారిటీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది నటి సదా. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకోలేక వాడుకోవచ్చు, కాకపోవచ్చు అని తెలిపింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని స్పష్టం చేసింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని, చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారని అందుకే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదని డైరెక్ట్‌గా చెప్పింది. అంతేకాదు అడ్జస్ట్ అవడం అనేది నా వల్లకాదని స్పష్టం చేసింది.
చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారంటూ..
హీరోయిన్ సదా మహారాష్ట్రలోని రత్నగిరిలో నివాసం ఉంటున్న ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి. ఆమె రత్నగిరిలో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబైకి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయంలో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబైలో నివసిస్తుంది. హైదరాబాదులోనూ ఒక ఇల్లుంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించిన సదా..
జయం సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో బుల్లితెరలో జడ్జీగా మారి ఆడియెన్స్‌ని అలరిస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో తారలా మెరిసిపోతుంది.