2021లో ద్రవిడ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.2022 'టీ20' ప్రపంచకప్ లో భారత్ సెమీ-ఫైనల్ నుండి నిష్క్రమించింది.ఆ తర్వాత2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయింది.అదే సంవత్సరం నవంబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ వన్డే ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేసే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలను గుర్తుచేశాడు.
బార్బడోస్‌లో సౌతాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లతో 'డ్రెస్సింగ్ రూమ్'లో ద్రవిడ్ రోహిత శర్మతో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.రోహిత్ శర్మ గత నవంబర్‌లో ఫోన్‌లో సంప్రదించాడు. పదవిలో కొనసాగాలని పట్టుబట్టాడని తెలిపాడు. దీని వల్లే ప్రపంచకప్ గెలిచిన చారిత్రాత్మక భారత జట్టుకు కోచ్ గా నిలిపాడని ద్రవిడ్ రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు. జట్టు ప్రయోజనాల కోసం రోహిత్, నేను చాలా చర్చించుకున్నాం. క్రికెట్ జీవితంలో పరుగులు, వికెట్లు ముఖ్యం కాదు. మైదానంలో జరిగిన జ్ఞాపకాలే ముఖ్యం. ప్రపంచకప్ గెలిచిన క్షణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవచ్చు. నా ప్రపంచకప్ జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి గర్వపడుతున్నాను. మీరందరూ నన్ను గౌరవంగా చూసారు.
గత కొన్నేళ్లుగా ఫైనల్‌కు చేరుకుని ట్రోఫీకి దూరమయ్యాం. ఈసారి పట్టుదలతో పోరాడి గెలిచాం. ఇందుకోసం ప్రతి ఆటగాడు ఎన్నో త్యాగాలు చేశాడు. ట్రోఫీ గెలవడానికి తల్లిదండ్రులు, కోచ్, సోదరుడు, భార్య, పిల్లలు ఎంతో త్యాగం చేశారు. జట్టు విజయానికి మంచి నిర్వహణ కూడా అవసరం. జట్టుకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి నా అభినందనలుని ద్రవిడ్ డ్రెస్సింగ్ రూంలో జట్టుతో పంచుకున్నారు.