/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Hyundai-i10-jpg.webp)
Hyundai i10 Second Hand Car: కారు ఒక స్టేటస్ సింబల్ అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పులు వచ్చాయి. సామాన్యులు సైతం కారును కొనుగోలు చేసే స్థాయికి వాటి ధరలు అందుబాటులో ఉన్నాయి. సామాన్యులు సైతం కార్లలో తిరుగుతూ తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది తమ కుటుంబ అవసరాల కోసమే కారును కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న ప్రజా రవాణా ఖర్చులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా.. ఇబ్బందులు పడటం ఇష్టం లేక ప్రజలు కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే, షోరూమ్ కార్లు కొనుగోలు చేయాలంటే డబ్బులు భారీగా పెట్టాల్సి వస్తుంది. అందుకే చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు.
మీరు కూడా మంచి కండీషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారుగానీ కొనాలని చూస్తున్నారా? మీకోసమే బెస్ట్ చాయిస్, బెస్ట్ ఆఫర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ యుగం నడుస్తోంది. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వాహనాల వరకు అన్నీ ఇంటర్నెట్ వేదికగా క్రయవిక్రయాల సాగుతున్నాయి. అలాగే, సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయానికి సంబంధించి కూడా అనేకం వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వెబ్‌సైట్లలో CarWale సైట్ ఒకటి. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా సెకండ్ హ్యాండ్ కార్లను చౌక ధరకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హ్యూందాయ్ i10 కారును చాలా తక్కువ ధరకే విక్రయానికి పెట్టింది.
Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?
హ్యూందాయ్ కంపెనికి చెందిన ఈ i10 షోరూమ్ ప్రైజ్ రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. అయితే, సెకండ్ హ్యాండ్ కారును చాలా తక్కువ ధరకే అందిస్తోంది CarWale. ఈ వెబ్‌సైట్‌లో 2009 మోడల్‌కి చెందిన హ్యూందాయ్ i10 Magna 1.2 మోడల్ కారును 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు లిస్ట్ చేసింది. ఈ కారు 26,000 కిలోమీటర్లు తిరగడం విశేషం. ఒకవేళ మీరు దీనిని కొనుగోలు చేయాలుకుంటే నేరుగా కారును పరిశీలించిన మీద కొనుగోలు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం CarWale వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!