హ్యుందాయ్ కారుపై కళ్లుచెదిరే డిస్కౌంట్..ఇంకెందుకు లేట్..కొనేయండి..!! హ్యుందాయ్ కంపెనీ సెడాన్ సెగ్మెంట్లలో..ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా కారుకొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఈ సంస్థ ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్లను ఇస్తుందో చూద్దాం. By Bhoomi 14 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి కొరియన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు సంస్థ అయిన హ్యుందాయ్ కు భారత మార్కెట్లో మంచి వాటా ఉంది. అయితే మీరుకొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే జూలై నెలలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10నియోస్ కారుపై కంపెనీ రూ.38,000 వరకు భారీ తగ్గింపును ఇస్తోంది. 83hp,1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్ - 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మీరు జూలై చివరి నాటికి Grand i10 Nios కొనుగోలు చేస్తే, మీకు రూ. 30,000 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ధర గురించి చెప్పాలంటే, Grand i10 Nios ప్రారంభ ధర రూ. 5.73 లక్షల నుండి రూ. 8.51 లక్షల వరకు ఉంది. విశేషమేమిటంటే Grand i10 Nios కూడా CNG వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ ట్రిమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్..బదులుగా, మాగ్నా ట్రిమ్ మాదిరిగానే ఈ వేరియంట్‌లో మాన్యువల్ AC అందిస్తుంది. స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ ట్రిమ్ మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్య ఉంది. స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ల మధ్య ధర వ్యత్యాసం రూ. 3,500. ఫిబ్రవరిలో, కంపెనీ తన గ్రాండ్ i10 నియోస్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. 2023 హ్యుందాయ్ i10 NIOS ప్రస్తుత మోడల్ లేదా భారతదేశంలో విక్రయించబడుతున్న మోడల్‌తో పోలిస్తే చిన్న అప్ డేట్స్ తో వస్తుంది. ఎన్-లైన్ వెర్షన్‌లో వచ్చిన ఈ హ్యుందాయ్ కారు, ఎన్ పెర్ఫామెన్స్ విభాగం నుండి స్ఫూర్తి పొందిన డిజైన్‌తో వస్తుంది. గ్రాండ్ i10 NIOS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 82 Bhp, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేసి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి