Hyper aadi: జబర్దస్త్ చేయను.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!

ఎన్నికలు అయ్యే వరకు జబర్దస్త్ చేయనని కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడంమే తన లక్ష్యమన్నారు. నెలరోజుల పాటు షూటింగులు బంద్ చేసుకొని ప్రచారం చేస్తామన్నారు.

Hyper aadi: జబర్దస్త్ చేయను.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!
New Update

Hyper aadi: ఎన్నికలు అయ్యే వరకు జబర్దస్త్ చేయను అని కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించడమే తన లక్ష్యమని కామెంట్స్ చేశారు. ఎన్నికలు అయ్యే వరకు షూటింగ్ లు బంద్ అని స్పష్టం చేశారు.

కోటి ఇచ్చినా సరే..

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. పవన్ కళ్యాణ్  లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంటికి లక్ష కాదు, కోటి రూపాయలు ఇచ్చినా సరే.. దత్తాత్రేయ స్వామే.. ఆయన్ని గెలిపించుకుంటారన్నారు.

Also Read: ఏపీకి ఆమె లేడీ విలన్.. బతుకంతా దానికోసమే: పోసాని కాంట్రవర్సీ కామెంట్స్!

పిఠాపురం లోనే..

నెలరోజుల పాటు తాము షూటింగులు బంద్ చేసుకొని పవన్ కళ్యాణ్ కోసం జనసేన పోటీ చేస్తున్న ప్రాంతాలలో ప్రచారం చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పిఠాపురం లోనే ఉంటామని వెల్లడించారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఉమ్మడి అభ్యర్థులు నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు.

సిద్ధంగా ఉన్నారు..

వైసీపీ వాళ్ల ఎంత సిద్ధంగా ఉన్నా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్ ను చూడటానికి ఎక్కడెక్కడ ఉన్నవారు హైదరాబాద్ వస్తారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురాన్ని చూడటానికి ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారందరూ ఇక్కడికి వస్తారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు పిఠాపురం బాట పడుతున్నట్లు తెలుస్తోంది.

#hyper-adi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe