హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైసీ కాలేజ్‌ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సకలం చెరువు బఫర్‌జోన్‌లోనే ఫాతీమా కాలేజీలు నిర్మించినట్లు తెలుస్తోంది. 12 ఫ్లోర్లుగా ఫాతీమా కాలేజ్ బిల్డింగులు నిర్మించారు. అయితే ప్రస్తుతం హైడ్రా దగ్గర 7 ఫ్లోర్ల వరకు మాత్రమే కూల్చే ఎక్విప్‌మెంట్ ఉంది. దీంతో కొత్త ఎక్పిప్‌మెంట్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Also Read: ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు.. కేటీఆర్!
ఒకేసారి 15 అంతస్తులను కూల్చే ఎక్విప్‌మెంట్ కోసం హైడ్రా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫాతిమా కళాశాల భవనాలను పరిశీలించి అధికారులు నివేదిక వచ్చారు. ఇదిలాఉండగా.. ఈ కాలేజ్‌లకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెరువులోనే ఈ కళాశాలలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.