హైదరాబాద్ లో కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. ఆక్రమణలను ఎక్కడిక్కడ నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది హైడ్రా. ఈ నేపథ్యంలో మాయమైపోయిన అనేక చెరువుల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్రమణలకు సంబంధించిన అంశాలు సైతం చర్చల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓవైసీ కబ్జాలపై తెలంగాణలో రాజకీయ దుమారం మొదలైంది. సలకం చెరువు మధ్యలో ఫాతిమా కాలేజీని ఓవైసీ నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
0.37 చదరపు కిలోమీటర్ల పరిధిలో బండ్లగూడలో సలకం చెరువు ఉంది. ప్రస్తుతం 0.111 చదరపు కిలోమీటర్లకే ఈ చెరువు పరిమితమైంది. 0.258 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. హైడ్రా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సలకం చెరువులో 70 శాతం కబ్జాకు గురైందని హైడ్రా తేల్చింది. 1979-2023 శాటిలైట్ ఫొటోలతో సహా హైడ్రా నివేదికను బయటపెట్టింది. సలకం చెరువు FTL పరిధిలోనే ఫాతిమా కాలేజీ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ చెరువు దగ్గరకు స్వయంగా వెళ్లి కబ్జాలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది. ఆ దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడండి.