హోం వర్క్ (Home Work) చేయలేదని తల పై పలుకతో కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన హైదరాబాద్ లోని (Hyderabad) ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రామంతపూర్ వివేక్ నగర్ లోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ అనే విద్యార్థి యూకేజీ (UKG) చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన హేమంత్ ను హోమ్ వర్క్ టీచర్ తలపైకి కొట్టింది.
ఇది కూడా చదవండి: Telangana News: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!!
దీంతో ఒక్కసారిగా అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనై అప్రమత్తమై హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఈ రోజు ధర్నా నిర్వహించారు. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియలు కోసం వారి స్వస్థలం వనపర్తికి తరలించారు. అయితే హేమంత్ గతంలోనూ అనారోగ్య సమస్యలతో బాధపడ్డట్లు తెలుస్తోంది.
నిత్యం ఆడుతూ పాడుతూ తమ కళ్లెదురుగా తిరిగే కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు చనిపోవడంతో తాము ఎలా బతకాలంటూ వారు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది.