/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rain-2-jpg.webp)
Rain Alert: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట,చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, హైటెక్ సిటీ, మల్కాజిగిరి, ఉప్పల్, లకిడికపూల్, అబిడ్స్, గోషామహల్, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల భారీ వాన కురుస్తోంది. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కాగా ,తెలంగాణకు 3 రోజులు వర్షాలు వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్ వాతవరణ శాఖ ముందుగానే అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
RED ALERT ISSUED FOR HYDERABAD
Note that steering winds are absolutely zero and wherever storms form, it will be huge STAND AND DELIVER RAINS, though not widespread but wherever it rains, it gonna pour massively. This is what I've expected and gave strong thunderstorms forecast
— Telangana Weatherman (@balaji25_t) September 27, 2023
వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని వెల్లడించారు.
Also Read: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!