/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-fatal-road-accidents-in-khammam-five-killed.jpg)
Hyd Accidents:హైదరాబాద్ నగర నడి బోడ్డున వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ఉప్పుల్ ఘటన మర్వకముందే మరో ఘటన కలకలం రేపుతోంది. నిన్న ఉప్పుల్‌లో బండి స్కిడ్ అయి.. ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాంటి ఘటన యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతి చెందింది. యూసఫ్‌గూడలో రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ఓ యువతి రోడ్డుపై పడింది. దీంతో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు యువతిపైకి ఎక్కడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె అప్పటికే మరణించింది. ప్రమాదం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ప్రమాదాలు ఒక్కేరోజు జరగటంతో నగర వాసులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. మృతి చెందిన యువతి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: మనుషుల కంటే గాడిదలకు IQ స్థాయి ఎక్కువ ఉంటుందా?..నమ్మలేని నిజాలు
 Follow Us
 Follow Us