గే డేటింగ్ యాప్ ట్రాప్ లో హైదరాబాద్ యూత్..న్యూడ్ వీడియోలతో చిత్రహింసలు..!

మోసపోయే వారు ఉన్నంత వరకు కేటుగాళ్లు ఏదో విధంగా బుట్టలో వేసుకొని దొరికినంత దోచుకుంటూనే ఉన్నారు. ఇక ఆన్ లైన్ ఘరానా దొంగలకు కాసులు కురిపిస్తుంది. తాజాగా గే డేటింగ్ యాప్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అఫ్రిది అనే వ్యక్తి యువకులను టార్గెట్ చేస్తూ ఈ మోసానికి పాల్పడుతున్నారు. ట్రాప్ లో పడిన యూత్ ను కత్తితో బెదిరించి న్యూడ్ వీడియోలు తీస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..

New Update
గే డేటింగ్ యాప్ ట్రాప్ లో హైదరాబాద్ యూత్..న్యూడ్ వీడియోలతో చిత్రహింసలు..!

మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయే వారు ఉన్నంత వరకు కేటుగాళ్లు ఏదో విధంగా బుట్టలో వేసుకొని దొరికినంత దోచుకుంటూనే ఉన్నారు. ఇక ఆన్ లైన్ ఘరానా దొంగలకు కాసులు కురిపిస్తుంది. ఇంకా ఈజీగా వారి ట్రాప్ లో జనాలను పడేస్తోంది. నిండా మునిగిన తరువాత కానీ తాము మోసపోయామన్న విషయం బాధితులకు తెలియడం లేదు. తెలుసుకున్న తరువాత సైబర్ క్రైం పోలీసుల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. అయితే ఆన్ లైన్ చీటర్స్ ను పట్టుకోవడం అంత సులువు కాదు. దీంతో మోసగాళ్ల మాయలో జనం పడుతూనే ఉన్నారు.

ఇక తాజాగా గే డేటింగ్ యాప్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అఫ్రిది అనే వ్యక్తి యువకులను టార్గెట్ చేస్తూ ఈ మోసానికి పాల్పడుతున్నారు. గే డేటింగ్ యాప్ పేరుతో ప్రచారం చేస్తూ.. కాంటాక్ట్ లోకి వచ్చిన యువకులను ట్రాప్ చేస్తున్నాడు. తరువాత కత్తితో బెదిరించి న్యూడ్ వీడియోలు తీస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులు, నగలు దోచుకుంటున్నాడు. వారు అడిగింది ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో వీడియోలు పెడతానని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో ఆ గే డేటింగ్ యాప్ చూసి అతని ట్రాప్ లో పడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను నిందితుడు అఫ్రిది పిలిచి నగ్నంగా వీడియోలు తీశాడు. అతడిని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు, బంగారం లూటీ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిందంతా చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి అఫ్రిది కోసం గాలిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి యాప్ ల ట్రాప్ లో పడి చాలా మంది యూత్ మోసపోతున్నారు.

ఆన్ లైన్ జాబ్ పేరుతో 46 లక్షలు స్వాహా..

సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆన్ లైన్ లో ఆశలు చూపి జనాలను నిండా ముంచుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ఎంప్లాయ్ ను సైబర్ మోసగాళ్లు పెద్ద కుచ్చుటోపి పెట్టారు. ఆన్ లైన్ జాబ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 లక్షలు దోచుకున్నారు. ఆన్ లైన్ జాబ్ అంటూ ఆమెకు మే 15న ఫోన్ కాల్ వచ్చింది. ఫార్మాలిటీస్ కోసం అని ఆమె దగ్గర్నుంచి రెండు వేల రూపాయలు కట్టించుకున్న సైబర్ మోసగాళ్లు మహిళకు తిరిగి వెంటనే 3 వేలు పంపించారు.

ఇంకేముంది.. తరువాత విడతల వారీగా ఆమె దగ్గర్నుంచి 46 లక్షలు లాగారు.అయితే డబ్బులు తీసుకున్న వారు జాబ్ విషయంలో ఎంతకీ స్పందించకపోవడంతో ఆమె మోసపోయాయని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలని.. పోలీసులు పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ జనం మాత్రం మోసపోతూనే ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు