/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ias-jpg.webp)
తెలంగాణలో మరో ఐఏఎస్ (IAS) అధికారిణి వేధింపులకు గురయ్యారు. గతంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాదిరిగానే హరిచందన్ అనే ఐఏఎస్ అధికారిణికి ఓ వ్యక్తి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి హల్ చల్ చేశాడు. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని ఆఫీసులో హరిచందన(Hari Chandana) అనే ఐఏఎస్ అధికారిణి డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆమెను గత కొంత కాలం నుంచి శివప్రసాద్ (Shivaprasad) అనే వ్యక్తి ఆమె పని చేస్తున్న చోటుకి వచ్చి వేధించేవాడు. ప్రతి రోజూ కూడా ఏదో పని ఉంది అని చెప్పి కార్యాలయానికి రావడం..ఏదోకటి మాట్లాడటంతో ఆమె విసిగి పోయారు.
ఏ పని లేకపోయినప్పటికీ వచ్చి కావాలని ఆమెతో మాట్లాడటంతో ఆమె విసిగిపోయి..అక్కడి సిబ్బందికి ఇంకోసారి అతనిని రానివ్వద్దని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో అతను శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వచ్చేశాడు. మేడమ్ ని కలవాలంటూ నానా హంగామా చేశాడు. మేడమ్ కి నేను సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ని అంటూ..లోపలికి వెళ్లనివ్వాలి అంటూ సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగాడు
Also Read: IAS Hari Chandana Success Story బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని..వజ్రం లాంటి కలను నెరవేర్చుకుంది..!!
దీంతో ఆమె ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ అధికారిణి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో శివప్రసాద్ పై కేసు నమోదు చేశారు.
updated soon.......