Hyderabad: ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలకలం.. హైదరాబాద్‌లో మత్తు దందా గుట్టురట్టు..! హైదరాబాద్‌లో ఐస్‌క్రీమ్‌ల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టురట్టయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1,5 లోని హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో అధికారులు దాడులు నిర్వహించారు. 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 06 Sep 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్‌లో మత్తుగాళ్లు కొత్త దారులు వెత్తుక్కుంటున్నారు. మొన్నటివరకు చిన్న పిల్లలు ఎక్కువగాతినే చాక్లెట్స్ లో మత్తు మందు కలిపి అమ్మేవారు. ఇప్పుడు ఐస్ క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. తాజాగా, మత్తు దందా గుట్టురట్టయింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో దాడులు నిర్వహించి 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. Also Read: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1, 5లోని హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 మి.లీ 100 పైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఫేస్ బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 11.5 కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీములను స్వాధీనం చేసుకున్నారు. Also Read: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు దయాకర్ రెడ్డి, శోభన్ అనే ఇద్దరు వ్యక్తులు విస్కీతో ఐస్ క్రీమ్ లను తయారు చేస్తున్నారు. దీంతో తయారీ, విక్రయదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 100 పైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి