Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

గణపతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్‌ విశ్వప్రసాద్‌ చెప్పారు. వాహనదారులు సహకరించి, తాము సూచించిన రూట్‌లో వెళ్లాలని కోరారు.

Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
New Update

Hyderabad Traffic: గణపతి ఉత్సవాల కారణంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి గణేష్‌ నిమజ్జనాలు ముగిసే సెప్టెంబర్ 17 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను పూర్తిగా మూసి వేయగా మరికొన్ని మార్గాల్లో సమయాలను కేటాయించారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్‌ విశ్వప్రసాద్‌ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఖైరతాబాద్ వచ్చే భక్తులు, సందర్శకులు.. నెక్లెస్ రోడ్, ఐమాక్స్‌ రోటరీ వైపు నుంచి రావాలని సూచించారు. భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

* ఖైరతాబాద్​ రైల్వే గేటు నుంచి వచ్చేవారు దర్శనం అనంతరం ఐమాక్స్​ థియేటర్ లేదా మిట్ కౌంపౌండ్​ వైపు వెళ్లాలి.
* మిట్ కౌంపౌండ్ ​నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, వార్డు ఆఫీస్ ముందు నుంచి వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మిట్ కౌంపౌండ్ వైపే వెళ్లాలి.
* ఖైరతాబాద్ ​ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్ వెళ్లొచ్చు. మిట్ కౌంపౌండ్ వాహనాలకు అనుమతి లేదు.
* ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్‌ మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు.

* ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రాజ్‌దూత్‌ లేన్‌లో బడా గణేష్ దగ్గరికి నో ఎంట్రీ. ఇక్బాల్ మినార్‌‌ మీదుగా వాహనాలను డైవర్ట్‌ చేస్తారు.
* ఇక్బాల్ మినార్‌‌ నుంచి మింట్ కాంపౌండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. మింట్‌ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
* ఎన్‌టీఆర్‌‌ మార్గ్‌, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌‌, నెక్లెస్ రోడ్స్‌ నుంచి మింట్ కంపౌండ్‌ వైపు నో ఎంట్రీ, నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌‌, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌‌ వైపు దారి మళ్లింపు.
* నిరంకారీ ఖైరతాబాద్ పోస్ట్‌ ఆఫీస్‌ లేన్‌ మీదుగా ఖైరతాబాద్‌ రైల్వే గేట్‌ వైపు నో ఎంట్రీ. వాహనాలను ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ జంక్షన్‌ మీదుగా డైవర్ట్ చేస్తారు.

పార్కింగ్‌ కోసం:
ఐమాక్స్‌ పక్కన అంబేద్కర్‌ స్క్వేర్‌‌, ఎన్‌టీఆర్ గార్డెన్స్, సరస్వతి విద్యామందిర్‌, రేస్‌ కోర్స్‌ రోడ్‌ పార్కింగ్‌ ఏరియాలు కేటాయించారు.

#hyderabad-traffic-alert #ganesh-chathurdhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe